SLW vs BANW: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 21 మ్యాచ్ లు పూర్తయ్యాయి. నిన్న శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఏడు పరుగుల తేడాతో శ్రీలంక అనూహ్యంగా విజయం సాధించింది. అటు గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ దారుణంగా ఓడిపోయింది. చివరి ఓవర్ లో నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్, మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా శ్రీలంక కెప్టెన్ చామరి అథపత్తు చివరి ఓవర్ అద్భుతంగా వేసి మూడు వికెట్లు పడగొట్టారు. మరో రన్ అవుట్ కూడా అయింది. దీంతో బంగ్లా చివరి ఓవర్ లో ఒకే ఒక్క పరుగు చేసి ఓడిపోయింది.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో లంక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో శ్రీలంక పైన బంగ్లాదేశ్ సులభంగా గెలుస్తుందని అందరూ అంచనా వేశారు. మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్ అద్భుతంగా రాణించింది. కానీ 46వ ఓవర్ నుంచి బంగ్లాదేశ్ పతనం మొదలైంది. 45 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు నష్టపోయిన బంగ్లాదేశ్ మహిళల జట్టు 176 పరుగులు చేసింది. ఇక 50 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయి 175 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ముఖ్యంగా శ్రీలంక కెప్టెన్ చామరి అథపత్తు వేసిన చివరి ఓవర్ బంగ్లాదేశ్ కొంప ముంచింది. ఆ ఓవర్ లో ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఒకే ఒక్క పరుగు రాబట్టింది. దీంతో ఏడు పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఈ ఓటమితో బంగ్లాదేశ్ ఇంటి దారి పట్టింది.
వన్డే వరల్డ్ కప్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయిన జట్లలో బంగ్లాదేశ్ మొదటిది కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.4 ఓవర్స్ లో 202 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 50 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. ఇది ఇలా ఉండగా.. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అలాగే సౌత్ ఆఫ్రికా మూడు జట్లు కూడా సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లాయి. అటు నాలుగో స్థానం కోసం టీమిండియా తో పాటు న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. నిన్న బంగ్లాదేశ్ జట్టుపై విజయంతో శ్రీలంక కూడా లైన్ లోకి వచ్చింది. అదృష్టం బాగుంటే శ్రీలంక కూడా సెమీఫైనల్ కు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. అటు ఇప్పటికే బంగ్లాదేశ్ ఇంటి దారి పట్టింది.
Sri Lanka move to 6th position in the points table after their win against Bangladesh in Navi Mumbai. 🔝#Cricket #BANvSL #CWC #Sportskeeda pic.twitter.com/wXCnVrUuSf
— Sportskeeda (@Sportskeeda) October 20, 2025