OTT Movie : ఓటీటీలో ఒక మలయాళ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ ట్విస్టులతో మతి పోగొడుతోంది. ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యేలా ఈ కథ ఉంటుంది. ఈ కథ ఇద్దరు పోలీసులు ఒక దొంగను పట్టుకునందుకు ఒక గ్రామంలోకి వెళ్తారు. అయితే ఆ గ్రామ ఒక వింత ప్రపంచంలా ఉంటుంది. అక్కడినుంచి బయటికి రావడం, పద్మవ్యూహ్యం ట్విస్ట్ కి మించి ఉంటుంది. వాళ్ళు ఒక టైమ్ లూప్ లో చిక్కుకుపోతారు. ఈ సినిమా దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరీ తీసిన మరో సినిమా జల్లికట్టు (2019) 93వ అకాడెమీ అవార్డ్స్‌కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. కానీ అది చివరి రౌండ్‌లో అవార్డును దక్కించుకోలేక పోయింది. దీని తరువాత 2021లో ఆడియన్స్ కి మైండ్ మడత పెట్టిన ఈ మూవీ పేరు ‘చురులి’. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘చురులి’ (Churuli) 2021లో వచ్చిన మలయాళం సైన్స్ ఫిక్షన్ మిస్టరీ సినిమా. లిజో జోస్ పెల్లిస్సేరీ దీనికి దర్శకత్వం వహించారు ఇందులో వినాయ్ ఫోర్ట్, చెంబాన్ వినోద్, జోజు జార్జ్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరీ 11న రిలీజ్ అయింది. 2021 నవంబర్ 19 నుంచి SonyLIV ఓటీటీలో రిలీజ్ అయింది. IMDbలో దీనికి 7.0/10 రేటింగ్ కూడా ఉంది.
అంతోనీ, షాజివాన్ అనే ఇద్దరు పోలీసులు, జోయ్ అనే క్రిమినల్‌ను పట్టుకోవడానికి చురులి అనే గ్రామానికి వస్తారు. వాళ్లు తమ అసలు పేర్లు చెప్పకుండా, ఫేక్ పేర్లతో అక్కడికి వస్తారు. థాంకన్ అనే వ్యక్తి వాళ్లను గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ గ్రామంలోకి వెళ్లిన తర్వాత బయటకు రావడం కష్టమని చెబుతాడు. ఆ గ్రామం కూడా చాలా వింతగా, భయంకరంగా ఉంటుంది. అక్కడి వాళ్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇక అంతోనీ, షాజివాన్ ఇప్పుడు ఆ గ్రామంలో జోయ్‌ను వెతుకుతారు. కానీ ఆ దొంగ అంత తేలిగ్గా కనిపించడు.
Read Also : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
ఆ గ్రామంలో ఉన్న మనుషులు చాలా రూడ్‌గా, వింతగా మాట్లాడతారు. అక్కడికి వెళ్ళాక బయటకు వెళ్లే దారి మాత్రం వీళ్ళు తెలుసుకోలేక పోతారు. వీళ్ళకు జోయ్‌ను వెతకడం కష్టమవుతుంది. ఆ గ్రామం ఒక వేరే లోకంలా, టైమ్ లూప్ లో ఉన్నట్లు ఉంటుంది. అంతోనీ, షాజివాన్ అక్కడే చిక్కుకుంటారు. జోయ్ గురించి ఒక సీక్రెట్ బయటపడుతుంది. అది మరో వింతలా అనిపిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ కూడా గందరగోళంగానే ముగుస్తుంది. చివరికి ఈ పోలీసులు జోయ్ ని పట్టుకుంటారా ? వీళ్ళు ఆ టైమ్ లూప్ లో చిక్కుకుంటారా ? ఆ గ్రామం చరిత్ర ఏమిటి ? అనే విషయాలను, ఈ మలయాళం సైన్స్ ఫిక్షన్ సినిమాని చూసి తెలుసుకోండి.