E-Paper
Advertisement

బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!

బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!
Advertisement

Samantha: ప్రముఖ టాలీవుడ్ నటి సమంత ప్రస్తుతం సినిమాలకు చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమె మరికొద్ది రోజులలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చారు. తన ప్రెగ్నెన్సీ జర్నీను సమంత ఎంతో ఎంజాయ్ చేస్తూ తన జర్నీకి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సమంత తాజాగా” ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా” ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత తనకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

బిడ్డ వస్తే జీవితమే మారిపోతుంది..

ప్రస్తుతం హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ పై సమంత బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత తన వ్యక్తిగత జీవితంలోకి రాబోతున్న కొత్త వ్యక్తి గురించి అలాగే మాతృత్వపు అనుభూతుల గురించి కూడా ప్రస్తావించారు. సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే .మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలోనే సమంత తన బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరు మీ జీవితంలోకి ఒక బిడ్డ వస్తే జీవితం మొత్తం మారిపోతుందని చెబుతున్నారు. నేను కూడా ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

రాజ్ కు నమ్మకం ఎక్కువ…

Advertisement

తన జీవితం పూర్తిగా మారిపోవడానికి సరికొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని రాబోయే బేబీ బంగారం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు సమంత ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా తన భర్త రాజ్ నిడిమోరి (Raj Nidimori)గురించి కూడా ఈమె మాట్లాడారు. రాజ్ కు తనపై చాలా నమ్మకం ఎక్కువ అని తెలిపారు. నేను నన్ను నమ్మడం కంటే, రాజ్ ఎక్కువగా నమ్ముతారని సమంత తెలిపారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మా ఇంటి బంగారం సినిమా గురించి కూడా ప్రస్తావించారు.

Advertisement

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి వంద కోట్ల కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అవ్వడం అనేది రాత్రికి రాత్రి జరిగింది కాదని ఈ సినిమా కోసం రెండు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడ్డామని సమంత తెలిపారు. ఈ సినిమా విషయంలో రాజ్ తనని బాగా నమ్మారని సామ్ గుర్తు చేసుకున్నారు. తాను సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు రాజ్ మాత్రం ఈ సినిమా చేయాలి అంటూ నన్ను ఎంతో ప్రోత్సహించారని, ఆ ప్రోత్సాహంతోనే మా ఇంటి బంగారం సినిమా చేశానని సమంత తెలిపారు. ఇక ఈ సినిమా సమయంలోనే సమంత ప్రెగ్నెంట్ కావడంతో తదుపరి ఇండస్ట్రీకి చిన్నవిరామం ప్రకటిస్తూ ప్రస్తుతం తన మాతృత్వపు క్షణాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

Also Read: నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాద ఉండదు .. నాగార్జునకు బిగ్ వార్నింగ్!

Related News

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

రణబాలి టీజర్ రిలీజ్..’సింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?

సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న కాలభైరవ, కావ్య.. ఫొటో వైరల్!

ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీని రిజెక్ట్ చేసిన CBFC? మరీ అంత డార్క?

సందీప్ రెడ్డి వంగకు విజయ్ కాస్ట్లీ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే..

Big Stories

Advertisement
×