Youtuber Nandana: ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ (Nandus world)నందన వీసా స్కాం ఆరోపణలలో భాగంగా అరెస్టు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కుంభకోణం పై విచారణ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో భాగంగా నందన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విచారణకు వెళ్లింది అయితే తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇలా లండన్ లో ఉన్నటువంటి ఈ జంట విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో వీరిపై కేసులు కూడా నమోదు అయ్యాయి.
ఇలా నందన మధుకర్ దంపతుల పట్ల లుకౌట్ నోటీసులు ఉన్నప్పటికీ ఈమె ఇండియా రావడం పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అసలు తనమీద కేసు ఉండి ఇండియాలో అడుగు పెడితే అరెస్టు చేస్తారని తెలిసినప్పటికీ నందన ఇండియా ఎందుకు వచ్చింది అంటూ ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఈ పనుల నిమిత్తం ఇండియా వచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఇలా నందన బిగ్ బాస్ హౌస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఈ విషయంపై కాంగ్రెస్ నాయకురాలు సంధ్య రెడ్డి (Sandya Reddy)స్పందిస్తూ బిగ్ బాస్ టీమ్ అలాగే నాగార్జునకు(Nagarjuna) గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సంధ్యారెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా నందన గురించి ఆమె బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం గురించి స్పందిస్తూ.. ఇలా ఎంతోమంది నిరుద్యోగ యువతలను మోసం చేసిన నందనను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని కచ్చితంగా రచ్చ చేస్తామని సంధ్యారెడ్డి తెలిపారు. అలాగే నాగార్జునకు, బిగ్ బాస్ టీంకు కూడా ఈమె వార్నింగ్ ఇచ్చారు.నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఇలాంటి క్రిమినల్స్ సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తారని తెలిపారు.
ఇలా మోసాలకు పాల్పడే వారిని వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి పంపిస్తే నాగార్జున గారిని కూడా ప్రశ్నిస్తామని ఈమెకు తెలిపారు. బిగ్ బాస్ అనేది ఒక బ్రో** హౌస్ అని అందులోకి ఇలాంటి బ్రో** పనులు చేసేవాళ్లే వెళుతుంటారని ఈమె బిగ్ బాస్ కార్యక్రమం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వీసా స్కామ్ లో భాగంగా అరెస్ట్ అయిన నందన కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ఇండియా వచ్చారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు సంధ్యారెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నందన తన పట్ల లుక్ అవుట్ నోటీసులు ఉన్నప్పటికీ ఇండియా రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
Also Read: రణబాలి టీజర్ రిలీజ్..’సింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ