E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo : సంజనతో ఇమ్మానుయేల్ పోటీ.. పంతం నీదా, నాదా..ఫైనలిస్ట్ లోకి వెళ్ళేది ఎవరు..?

Bigg Boss 9 Telugu Promo : సంజనతో ఇమ్మానుయేల్ పోటీ.. పంతం నీదా, నాదా..ఫైనలిస్ట్ లోకి వెళ్ళేది ఎవరు..?
Advertisement

Bigg Boss 9 Telugu Promo: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. 8 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదోవ సీజన్ లోకి అడుగుపెట్టింది.. ఈ సీజన్ మొదలు ఈ 12 వారాలు పూర్తయింది.. ప్రస్తుతం 13 వ వారం ప్రసారమవుతుంది. మరి కొన్ని రోజుల్లో ఈ షో కి శుభం కార్డు పడిపోతున్న నేపథ్యంలో బిగ్ బాస్ కీలకమైన టాస్కులతో కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ లోకి వెళ్లేందుకు కంటెస్టెంట్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన రెండో ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు.. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది… ఈ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

రీతుకు షాకిచ్చిన ఇమ్మానుయేల్…

ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారు బిగ్ బాస్.. మొదటి ప్రోమో ప్రకారం చూస్తే ఫైనలిస్ట్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో నంబర్స్ టాస్క్ లో ఇమ్మూ గెలిచినట్లు తెలుస్తుంది. రీతూ, కళ్యాణ్ పోటీ పడ్డారు. కానీ ఇమ్మూ గెలిచినట్లు తెలుస్తుంది.. ఆ టాస్క్ లో విన్నర్ అవ్వడం రీతూకు పెద్ద షాక్.. ఇక పోతే అతను మరొకరితో పోటీపడే అవకాశాన్ని గెలుచుకుంటాడు. మొదటి ఫైనలిస్ట్ లోకి చేరుకోవాలంటే ఇంకాస్త కష్టపడాలి..

సంజనతో పోటీ పడ్డ ఇమ్మానుయేల్..

Advertisement

బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ఎపిసోడ్ రెండు ప్రోమోను రిలీజ్ చేశారు.. ఆ ప్రోమోలో.. మొదటి టాస్క్ లో గెలిచినందుకు ఇమ్మూకు సువర్ణ అవకాశం ఇస్తాడు బిగ్ బాస్.. అందరికన్నా నువ్వు ఉన్న కలర్ ఎక్కువ రావాలి.. అప్పుడే నువ్వు విన్నర్ అవుతావు.. అయితే ఇప్పుడు నువ్వు మరొకరితో పోటీ పడాలి అని బిగ్ బాస్ అంటాడు. మరి హౌస్ లో ఉన్న వారితో ఎవరితో నువ్వు పోటీ పడాలని అనుకుంటున్నావు అని బిగ్ బాస్ అడుగుతాడు.. దానికి ఇమ్మూ నేను సంజన తో పోటీ పడాలనుకుంటున్నాను అని అంటాడు. వారిద్దరికీ ఒక టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్..

Also Read :అవమానించాలని అనుకోలేదు.. కాంతార కాంట్రవర్సీ కామెంట్స్‌పై రణవీర్ రియాక్షన్..

పంతం నీదా, నాదా.. విన్నర్ ఎవరు..? 

Advertisement

సంజన, ఇమ్మానుయేల్ కు పంతం నీదా నాదా అనే టాస్క్ ని ఇస్తాడు.. ఈ టాస్క్ లో ఎవరైతే బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్లే ఫైనలిస్ట్ కి వెళతారు అని బిగ్ బాస్ చెప్తాడు. సంజన ఇమ్మానుయేల్ ఇద్దరూ కలిసి బాస్కెట్ లో బాలు వేసి దానికి తెగ కష్టపడి పోతారు. అయితే సంజన మధ్యలోనే ఆగిపోతుంది. ఆడు ని వదలకుండా బాలు వెయ్యాలని బిగ్ బాస్ పెట్టిన కండిషను బ్రేక్ చేస్తుంది. దాంతో అక్కడున్న సంచాలక్ తాడును వదిలేసారు అని చెప్పడంతో ఇమ్మానుయేల్ ఫ్రీ అవుతాడు.. నేను తాడును వదిలేసాను అని సంజన కన్నీళ్లు పెట్టుకుంటుంది. మొత్తానికి ఈ టాస్క్ లో ఇతను విన్నర్ గా నిలుస్తాడు. నెక్స్ట్ ఇమ్ము ఎవరితో పోటీ పడతాడు? ఆ పోటీలో గెలుస్తాడా? ఫస్ట్ ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అవుతాడా..? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఇవాల్టి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×