E-Paper
Advertisement

ఏసీ ఉన్నోళ్లకి గుడ్ న్యూస్.. చలికాలంలో ఇలా వాడితే.. ఇల్లంతా ఫుల్ వెచ్చదనం!

ఏసీ ఉన్నోళ్లకి గుడ్ న్యూస్.. చలికాలంలో ఇలా వాడితే.. ఇల్లంతా ఫుల్ వెచ్చదనం!
Advertisement

Hot Cold AC: సాధారణంగా దేశంలో వేసవి కాలం ముగియగానే ఏసీలను ఆపేస్తుంటారు. తిరిగి వేసవి వచ్చేవరకు ఏసీల జోలికి చాలామంది వెళ్లరు. అయితే ఇంకొందరు చలికాలం కోసం రూమ్ హీటర్లు కొని.. డబ్బులు ఖర్చు చేస్తుంటారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం మార్కెట్లో అడ్వాన్స్డ్ స్ప్లిట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అన్ని కాలాలకు (ఆల్ వెదర్ లేదా హాట్ అండ్ కోల్డ్ మోడల్స్) తగ్గట్లుగా పనిచేసేలా వీటిని డిజైన్ చేశారు. అలాంటి ఏసీనే మీ ఇంట్లోనూ ఉంటే.. కొత్తగా రూమ్ హీటర్ కొనాల్సిన అవసరమే లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో చలికాలంలో ఈ అడ్వాన్స్డ్ ఏసీలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ కథనంలో చూద్దాం.

ఆల్ వెదర్ ఏసీలు ఎలా పనిచేస్తాయి?

ఈ ఏసీలు సాధారణ ఏసీల మాదిరిగానే రిఫ్రిజిరేటెంట్ సైకిల్ సూత్రంపై పనిచేస్తాయి. కాకపోతే ఇందులో ‘రివర్సింగ్ వాల్వ్’ అనే అడిషనల్ ఫీచర్ ఉంటుంది. కూలింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏసీ గదిలోని వేడిని బయటికి పంపిస్తుంది. అదే హీటింగ్ మోడ్‌లో ఈ వాల్వ్ రివర్స్‌లో పనిచేసి బయటి గాలిలోని వేడిని లోపలికి లాగి గదిని వెచ్చగా ఉంచుతుంది. ఈ ఏసీలు నేరుగా విద్యుత్‌తో వేడిని పుట్టించకుండా గాలిలో ఉన్న వేడిని ఒకచోటి నుంచి మరోచోటికి మారుస్తాయి. కాబట్టి సాధారణ రూమ్ హీటర్లతో పోలిస్తే చాలా తక్కువ కరెంట్ వాడుకుంటాయి.

ఏసీకి హీటింగ్ మోడ్ ఉందో లేదో ఇలా చెక్ చేయండి

Advertisement

ముందుగా రిమోట్‌లోని ‘మోడ్’ (Mode) బటన్ నొక్కండి. అక్కడ ‘హీట్’ (Heat) అనే ఆప్షన్ ఉండి సూర్యుడి (Sun) ఐకాన్ కనిపిస్తే మీ ఏసీకి హీటింగ్ సపోర్ట్ ఉన్నట్టే. లేదంటే ఇండోర్ యూనిట్ పై ఉండే స్టిక్కర్ లేదా మోడల్ పేరును చెక్ చేయండి. హాట్ అండ్ కోల్డ్ మోడల్స్‌లో కూలింగ్ కెపాసిటీతో పాటు హీటింగ్ కెపాసిటీ వివరాలు కూడా రాసి ఉంటాయి. అది సాధ్యపడని పక్షంలో ప్రొడక్ట్ యూజర్ మాన్యువల్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఏసీ మోడల్ నెంబర్ కొట్టి అది ‘హాట్ అండ్ కోల్డ్’ వేరియంటో కాదో నిర్దారించుకోవచ్చు. అదే విధంగా ఏసీ వై-ఫై సపోర్ట్ గలదైతే కంపెనీ అధికారిక యాప్ ఓపెన్ చేసి.. అందులో ‘హీట్’ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.

హీటింగ్ మోడ్‌ను ఎలా వాడాలి?

గదిలో ఎక్కువ కరెంట్ ఖర్చు కాకుండా హాయిగా ఉండాలంటే ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య సెట్ చేసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. కిటికీలు, తలుపులు గట్టిగా మూసి ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే వేసవి కాలం తర్వాత మొదటిసారి ఏసీ ఆన్ చేసే ముందు ఫిల్టర్లను శుభ్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు.

Advertisement

Also Read: ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఇష్టపడే హీరో అతనేనా? అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ!

ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

ఒక్కోసారి ఏసీలో హీటింగ్ మోడ్ ఆన్ చేసిన వెంటనే ఇండోర్ ఫ్యాన్ గాలిని ఇవ్వకపోవచ్చు. కాయిల్ వేడెక్కడానికి సమయం తీసుకోవడమే ఇందుకు కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు. చల్లటి గాలి నేరుగా గదిలోకి రాకుండా ఉండటానికే ఈ ఏర్పాట్లు కంపెనీలు చేస్తాయి. అలాగే బయటి యూనిట్‌పై ఏర్పడే మంచును తొలగించడానికి ఏసీ అప్పుడప్పుడు హీటింగ్‌ను కాసేపు నిలిపివేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: ఉద్యోగంతో విసిగిపోయారా? రూ. లక్ష ఉంటే చాలు.. ఇంటి నుంచే ప్రారంభించగల వ్యాపారాలు ఇవే!

Tags

Related News

ఫోటోలు పోయాయని బాధపడుతున్నారా? టెన్షన్ వద్దు మామ.. ఈ 7 ట్రిక్స్ మీ కోసమే!

మతిపోయే ఫీచర్లతో బెస్ట్ ఇయర్‌బడ్స్,ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

రూ. 20,000 లోపే బెస్ట్ మానిటర్స్.. వర్క్, గేమింగ్ వాడకం ఏదైనా.. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మామ!

తక్కువ బడ్జెట్‌లో నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..ఈ ఛాన్స్ మిస్ అయితే కష్టమే!

65 ఇంచుల టీవీపై 66 % డిస్కౌంట్..ఎన్నడూ లేని ఆఫర్

OTP అవసరం లేదు.. కాల్ చేయక్కర్లేదు.. ‘No’ అని టైప్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

ఇక మీ చాట్‌జీపీటీ డేటా సేఫ్..ఫేస్ ఐడీ, పిన్ లాక్ ఫీచర్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×