E-Paper
Advertisement

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఇష్టపడే హీరో అతనేనా? అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ!

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఇష్టపడే హీరో అతనేనా? అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ!
Advertisement

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి (Ranabaali)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే రష్మిక విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కాఫీ విత్ కరణ్ (Koffee With Karan)టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)రష్మిక (Rashmika) ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

అర్ధరాత్రి అల్లు అర్జున్ కి ఫోన్..

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీ ఫ్రెండ్ కు కాల్ చేయాలనే టాస్క్ ఇవ్వగా విజయ్ దేవరకొండ వెంటనే అల్లు అర్జున్(Allu Arjun) కు ఫోన్ చేశారు. ఇలా విజయ్ రాత్రి 11.40 గంటల సమయంలో అల్లు అర్జున్ కు ఫోన్ చేయగా వెంటనే బన్నీ ఫోన్ లిఫ్ట్ చేశారు బన్నీ అన్న నిద్రలేచే ఉన్నారా? అని అడగడంతో బన్నీ అవునని సమాధానం చెప్పారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయడానికి గల కారణాన్ని విజయ్ దేవరకొండ వివరించారు.

సమయం సందర్భం లేదు..

Advertisement

ప్రస్తుతం తాను కాఫీ విత్ కరణ్ షోలో ఉన్నానని వీళ్లకు ఏమాత్రం సమయం సందర్భం లేదు ఈ టైంలో ఎవరికో ఒకరికి కాల్ చేయమని చెప్పారు అయితే ఇండస్ట్రీలో నన్ను ఇష్టపడే వారు, నన్ను తిట్టకుండా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ టైంలో ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేస్తారు? నాతో అంత చనువుగా ఉన్నది ఎవరని ఆలోచిస్తే మీ పేరే గుర్తుకు వచ్చింది అందుకే మీకే కాల్ చేశాను అంటూ విజయ్ దేవరకొండ అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయడానికి గల కారణాన్ని తెలిపారు.. అయితే అల్లు అర్జున్ సైతం ఒకే పర్వాలేదు నువ్వు కాల్ చేయడం సో స్వీట్ అంటూ బదులిచ్చారు.

Advertisement

ఇక ఈ ఫోన్ కాల్ లో భాగంగా అల్లు అర్జున్ విజయ్ దేవరకొండతో మాత్రమే కాకుండా, కరణ్ జోహార్, రష్మిక మందన్నతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ ఫోన్ కాల్ సంభాషణపై విభిన్న రీతిలో చర్చలు జరుపుతున్నారు. విజయ్ దేవరకొండను ఇండస్ట్రీలో ప్రేమించే ఏకైక హీరో అల్లు అర్జునేనా? బన్నీతో విజయ్ దేవరకొండకు అంత మంచి బాండింగ్ ఉందా? అంటూ చర్చలు జరుపుతున్నారు. ఇక రష్మిక మందన్న అల్లు అర్జున్ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పుష్ప సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ రష్మిక మందన్న ఇద్దరు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకుని ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ వీడియోని ఇటు అల్లు అర్జున్ అభిమానులు, విజయ్ దేవరకొండ అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు.

Also Read: సంక్రాంతి తప్ప వేరే డేట్ కనిపించలేదా? మెగా హీరో సినిమాకు బెదిరింపు ఫోన్ కాల్స్?

Related News

బిజినెస్ లో సమంత దూకుడు.. 8 నెలల్లోనే రూ. 120 కోట్ల లాభాలు..పోస్ట్ వైరల్!

సంక్రాంతి తప్ప వేరే డేట్ కనిపించలేదా? మెగా హీరో సినిమాకు బెదిరింపు ఫోన్ కాల్స్?

‘నల్లమల’ డైరెక్టర్ రవి చరణ్ కొత్త మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్.. వారే టార్గెట్ గా!

విశ్వక్ సేన్ ఎదురుగా లైవ్‌లో వ్యక్తిని షూట్ చేసిన యాంకర్, అతడి పరిస్థితి ఎలా ఉందంటే?

ఆ భయమే నన్ను వెంటాడుతోంది.. రష్మిక బ్రతిమలాడడంపై విజయ్ షాకింగ్ రియాక్షన్!

నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి.. జాన్వీ వివాదంపై రష్మిక రియాక్షన్!

మెగా హీరో చేసుకోబోయే అమ్మాయి ఈమెనా..?

Big Stories

Advertisement
×