E-Paper
Advertisement

Hyderabad News: ఎయిర్ హోస్టెస్‌కు లైంగిక వేధింపులు.. అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడు, ఆపై అరెస్ట్

Hyderabad News: ఎయిర్ హోస్టెస్‌కు లైంగిక వేధింపులు.. అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడు, ఆపై అరెస్ట్
Advertisement

Hyderabad News: ఎయిర్ హోస్టెస్‌పై అభ్యకరం, లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రయాణికుడ్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఎయిరిండియా విమానంలో ఈ ఘటన జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు RGIA పోలీసులు. నిందితుడు కేరళకు చెందినవాడు.

ఎయిర్ హోస్టెస్‌కు లైంగిక వేధింపులు

Advertisement

ఈ మధ్యకాలంలో విమానంలో వేధింపుల ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. అఫ్ కోర్సు అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. దుబాయ్‌ నుంచి ఎయిరిండియాకు ఏఐ–2204 తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది.

ఆ విమానం మార్గ మధ్యలో ఉన్నప్పుడు 17 సీ సీటులో కూర్చున్న ఓ ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌ను పలుమార్లు అసభ్యకరంగా చేతితో తాకాడు. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు పొరపాటున చేయి తగిలినట్టు తొలుత విమానం సిబ్బంది భావించారు. అయితే విమానం నుంచి దిగిన సమయంలో పాస్‌పోర్టు మరిచిపోయినట్లు చెప్పి సదరు ప్రయాణికుడు సీటు వద్దకు వెళ్లాడు.

Advertisement

వేధింపులకు పాల్పడిన ప్రయాణికుడు అరెస్ట్

ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిపై వైట్ పేపర్‌పై అసభ్యకరంగా రాయడం, ఆపై దూషించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేబిన్ సిబ్బంది ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రయాణికుడిపై సెక్షన్ 74 (ఆమె గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఒక మహిళపై దాడి లేదా క్రిమినల్ బలప్రయోగం), సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) భారతీయ న్యాయ సంహిత ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

ALSO READ: ప్రేమ.. పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. 8 నెలలకే ఐఏఎస్ కూతురు సూసైడ్

నిందితుడ్ని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అతడ్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. అరెస్టయిన వ్యక్తి కేరళకు చెందినవాడు. అతడి వయస్సు 30 ఏళ్లు. సిబ్బందిపై ప్రయాణికులు అసభ్యంగా  వర్తించినా, దూషించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు.  ఇదేకాదు.. ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో జోరందుకున్నాయి కూడా.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×