E-Paper
Advertisement

Maa Inti Bangaram: రెండో పెళ్లి తర్వాత… సమంత కం బ్యాక్ మూవీ ట్రైలర్ వచ్చేస్తోంది

Maa Inti Bangaram: రెండో పెళ్లి తర్వాత… సమంత కం బ్యాక్ మూవీ ట్రైలర్ వచ్చేస్తోంది
Advertisement

Maa Inti Bangaram: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. మొదటి భర్త నాగచైతన్యకి విడాకులు ఇచ్చిన తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ బాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె.. సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిన ఈమె.. గత ఏడాది డిసెంబర్ 1న ఈశా యోగ సెంటర్ సమీపంలో ఉన్న లింగ బైరవి సన్నిధిలో భూత శుద్ధ పద్ధతిలో వివాహం చేసుకుంది.

ఇకపోతే రెండవ వివాహం తర్వాత సమంత మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సహనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ . నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది సమంత. ఇకపోతే తాజాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ.. సమంత లుక్ పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుండి టీజర్ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నట్లు సమంత అధికారికంగా ప్రకటించింది.

ఆకట్టుకుంటున్న సమంత లుక్ పోస్టర్..

Advertisement

తాజాగా సమంత లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సమంత యాక్షన్ లుక్ లో కనిపించింది. ముఖ్యంగా సమంత తొలిసారి తెలుగులో ఇలాంటి పాత్రలో కనిపించబోతోందని, ఈమె లుక్ చాలా అద్భుతంగా ఉంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ పోస్టర్ ను సమంత కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ..” చూస్తూ ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది” అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది .మరి యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధమవుతున్న సమంత కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అందుకుంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై తన భర్తతో కలిసి నిర్మిస్తోంది సమంత.

also read:Nagarjuna: నాగ్ 100వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. సెంటిమెంట్ రిపీట్ అయిందో హ్యాట్రిక్ గ్యారెంటీ!

సమంత కెరియర్:

Advertisement

ఒకవైపు నిర్మాతగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈమె మరొకవైపు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మరోవైపు రెండవ పెళ్లి చేసుకున్న ఈమె ఇప్పుడిప్పుడే సంతోషంగా తన వైవాహిక జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తోంది. గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులతో సతమతమైన సమంత ఈ కొత్త ఏడాది మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×