E-Paper
Advertisement

Trump On Venezuela Oil: బయటపెట్టిన ట్రంప్.. వెనిజులా చమురు, ఆ డబ్బుపై అమెరికా నియంత్రణ

Trump On Venezuela Oil: బయటపెట్టిన ట్రంప్.. వెనిజులా చమురు, ఆ డబ్బుపై అమెరికా నియంత్రణ
Advertisement

Trump On Venezuela Oil: ఎట్టకేలకు వెనిజులా వ్యవహారంపై నోరు విప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రస్తుతం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను అమెరికాకు అందజేస్తుందని వెల్లడించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆయిల్‌పై వచ్చిన ఆ డబ్బును తాను నియంత్రిస్తానని చెప్పకనే చెప్పారు.

Advertisement

ఎట్టకేలకు బయటపెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Advertisement

అమెరికా పేరు చెప్పగానే ఆయిల్ వనరులున్న దేశాలు గజగజ వణుకుతుంటాయి. ఆయిల్‌ని సొంతం చేసుకునేందుకు ఆదేశం ఎదురుదాడి చేస్తుందని చాలా దేశాలు భయపడతాయి. ఎందుకంటే గడిచిన మూడు దశాబ్దాలుగా ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాలపై రిపబ్లికన్ పాలకులు చేసిన దాడులు అన్నీ ఇన్నీకావు. ప్రస్తుతం వాళ్ల దారిలోనే ట్రంప్ కూడా నడుస్తున్నారు. గతంలో సీనియర్ జార్జి డబ్ల్యూ బుష్, ఆ తర్వాత జూనియర్ బుష్, ఇప్పుడు ట్రంప్ వంతైంది. వీరంతా రెండోసారి అధికారంలోకి వచ్చిన నేతలే.

ఇక అసలు విషయానికొద్దాం. వెనిజులా చమురుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో 30 నుంచి 50 మిలియన్‌ బ్యారెళ్ల చమురును అమెరికా కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అయితే ఆయిల్ వచ్చిన ఆదాయం తన నియంత్రణలో ఉంటుందని మనసులోని మాట బయపెట్టారు.

వెనిజులా చమురు, ఆ డబ్బుపై అమెరికా నియంత్రణ

వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను బంధించిన నాలుగైదు రోజులకు ఈ ప్రకటన చేశారు ట్రంప్. ప్రస్తుతం వెనిజులాలోని తాత్కాలిక ప్రభుత్వం.. టాప్ క్వాలిటీ గల 30 నుంచి 50 మిలియన్‌ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఆదేశం ఈ ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఆయిల్‌పై వెనిజులాకు ఇచ్చే డబ్బును ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని తెలిపారు. ఈ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్‌ను కోరానని ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. చమురు నిల్వలను నౌకల ద్వారా అమెరికా ఓడ రేవులలో దించనున్నట్లు తెలిపారు.

ALSO READ: ఇండోనేషియాలో కుండపోత వర్షాలు.. 16 మంది మృతి

వెనిజులాకు సంబంధించి చమురు కంపెనీల కార్యనిర్వాహకులతో శుక్రవారం వైట్‌హౌస్ కీలక సమావేశాన్ని నిర్వహించనుందని అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి ఎక్సాన్, చెవ్రాన్, కోనోకో ఫిలిప్స్ ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.  ప్రపంచంలోని చమురు నిల్వలలో ఐదో వంతు వెనిజులా దేశంలో ఉంది.

ప్రస్తుతం వెనిజులా ఉపాధ్యక్షురాలు రోడ్రిగ్జ్.. స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ట్రంప్‌తో సహకరించడానికి తాను ఎంతగా సిద్ధంగా ఉన్నారని చెప్పకనే చెప్పారు. కొన్నిసార్లు రాజీపడివారిని ధిక్కరించేవారిగా అనిపించిందని తెలిపారు. చమురు నిల్వలను వెలికి తీయడానికి దారులు తెరవాలని అమెరికా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేయడం కొసమెరుపు.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×