E-Paper
Advertisement

Xiaomi 17 Ultra: ఫొటోగ్రఫీ లవర్స్‌కు పండగే.. దుమ్మురేపే ఫీచర్లతో షియోమి 17 అల్ట్రా దిగనుంది!

Xiaomi 17 Ultra: ఫొటోగ్రఫీ లవర్స్‌కు పండగే.. దుమ్మురేపే ఫీచర్లతో షియోమి 17 అల్ట్రా దిగనుంది!
Advertisement

Xiaomi 17 Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి నుంచి త్వరలో ‘షియోమి 17 అల్ట్రా’ లాంచ్ కానుంది. ఇప్పటికే సియోమి 17 సిరీస్ మార్కెట్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు షియోమి 17 Ultraను పరిచయం చేసేందుకు చూస్తోంది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వెర్షన్‌లలో రావొచ్చని సమచారం. అలాగే ఇది శాటిలైట్ కనెక్టివిటీని కలిగి ఉండి, నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లోనూ కనెక్టివిటీని అనుమతిస్తుందట. ఈ ఫోన్ సిరీస్‌లో షియోమి 17, షియోమి 17 ప్రో, షియోమి 17 ప్రో మ్యాక్స్ ఉన్నాయని సమాచారం.

అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్:

ఈ Xiaomi 17 Ultra స్మార్ట్‌ఫోన్‌ ఈ నెలాఖరు లేదా 2026 ప్రారంభంలో గానీ చైనాలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఇది శక్తివంతమైన క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ పొందే అవకాశం ఉన్నందున ఉత్తమ స్మార్ట్‌ఫోన్ రేసును గెలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు టెక్ నిపుణులు. ఈ ఫోన్ 144 Hz వరకు రిఫ్రెష్ రేట్, అధిక మన్నికతో పెద్ద 6.82-అంగుళాల లేదా 6.9-అంగుళాల LTPO OLED ఫ్లాట్ డిస్‌ప్లే వచ్చే అవకాశం ఉంది. అలాగే 16GB RAM లేదా 1TB UFS 4.0 స్టోరేజ్‌తో రావొచ్చని అంచనా.

Advertisement

Also Read: భారత మార్కెట్లోకి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ లైఫ్, AI కెమెరాతో పిచ్చ క్లారిటీ!

స్పెసిఫికేషన్లు ఇలా:

Xiaomi 17 Ultra స్మార్ట్‌ఫోన్‌ నుంచి శక్తివంతమైన పనితీరును ఆశించవచ్చు. ఎందుకంటే.. ఇది కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను పొందే అవకాశం ఉంది. దీనితో పాటు 16GB RAM, 512GB లేదా 1TB UFS 4.0 స్టోరేజీ లభించవచ్చు. ఇన్ని ప్రత్యేక ఫీచర్లు కలిగిన ఈ షియోమి కొత్త ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు అసాధారణమైన పనితీరును అందిస్తుందట.

Advertisement

ఈ షియోమి స్మార్ట్‌ఫోన్ ప్రీమియం బిల్డ్‌తో, 3D-ప్రింటెడ్ టైటానియం అల్లాయ్ ఫ్రేమ్‌‌తో రావచ్చు. ఇది వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 2K రిజల్యూషన్,144 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల లేదా 6.9-అంగుళాల LTPO OLED ఫ్లాట్ డిస్‌ప్లేను పొందచ్చు. పీక్ బ్రైట్‌నెస్ 5000 నిట్‌ల వరకు ఉంటుందని లీక్స్ సూచిస్తున్నాయి. ప్రత్యక్ష సూర్యకాంతి పరిస్థితుల్లోనూ ఈ ఫోన్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు. దీనికి షియోమి షీల్డ్‌గ్లాస్ 2.0 ప్రొటక్షన్ ఉంటుుందని భావిస్తున్నారు.

కెమెరా ఫీచర్లే హైలెట్:

షియోమి 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. దాదాపు 7000mAh – 7500 mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా దీని కెమెరా సెటప్ ఒక ప్రధాన హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఇది లైకాతో కలిసి ఇంజనీరింగ్ చేయబడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ హ్యాండ్ సెట్ 200MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్, 50 MPమెయిన్ సెన్సార్, 50 MP అల్ట్రా-వైడ్ లెన్స్, రెండవ 50MP టెలిఫొటో లెన్స్‌లను కలిగి ఉన్న క్వాడ్ కెమెరా సెటప్‌, అలాగే ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చని అంచనా.

Also Read: వారెవ్వా అనేలా హానర్ కొత్తఫోన్.. 200MP కెమెరా, 7200 mAh బ్యాటరీతో లాంచ్!

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×