BigTV English

Samantha: డైరెక్టర్‌తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. ఫోటోలు వైరల్

Samantha: డైరెక్టర్‌తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. ఫోటోలు వైరల్

సమంత (Samantha).. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె.. ఇప్పుడు నిర్మాతగా మారి ‘శుభం’అనే సినిమాను నిర్మించింది. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకుంది. మరొకవైపు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది సమంత. ఇదిలా ఉండగా సమంత గత కొన్ని రోజులుగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు. చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. పైగా రాజ్ భుజంపై తలవాల్చి మరీ సమంత ఫోటోలకు ఫోజులిస్తోంది. దీన్ని చూసి ఇక వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత..

ఇదిలా ఉండగా సమంత మరొకసారి తామిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అనిపిస్తోంది. అందుకే మళ్లీ వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. సమంత తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా రాజ్ నిడిమోరు తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా రాజ్ నిడిమోరు.. సమంత భుజంపై చేయి వేసి దిగిన ఫోటో ఇప్పుడు షేర్ చేయడంతో ఇది సంచలనంగా మారింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్స్ కూడా ఇంత క్లోజ్ గా చూడడంతో సమంత రిలేషన్ ను కన్ఫర్మ్ చేసింది. ఇక త్వరలోనే పెళ్లి కూడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సమంత వ్యక్తిగత జీవితం..

సమంత వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2017లో అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ.. అడపా దడపా సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా బాలీవుడ్లో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ చేసిన సమంత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇందులో చాలా బోల్డ్ గా నటించడంతో అందరూ ఈమెపై విమర్శలు గుప్పించారు. నిజానికి ఈమె నటన ఒక అద్భుతం అని చెప్పాలి. ఎప్పుడు హీరోయిన్గా పాత్రలు చేసి చూసే ఆడియన్స్ కు బోర్ తెప్పించిన సమంత.. ఈ ఒక్క సినిమాతో తన నటనలోని ప్రతిభను అందరికీ కనబరిచి శభాష్ అనిపించుకుంది. ఇక దీనివల్లే సమంత – నాగచైతన్య మధ్య విభేదాలు వచ్చాయని అంటూ ఉంటారు . కానీ ఇప్పటివరకు వీరి విడాకులకు అసలు కారణం తెలియదు. అలా నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు సమంత – నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala) తో ఏడడుగులు వేయగా.. సమంత ఇప్పుడు రాజ్ ను వివాహం చేసుకునే ఆలోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ:Aamir Khan: మూడో పెళ్లిపై అమీర్ ఖాన్ కీలక ప్రకటన.. ఇది సంతోషమా లేక ఆశ్చర్యమా?

 

Related News

Ilaiyaraaja : మైత్రి మూవీ మేకర్స్ కు దిమ్మతిరిగే షాక్.. 5 కోట్లు డిమాండ్..

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Big Stories

×