Aamir Khan: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సొంతం చేసుకున్నారు అమీర్ ఖాన్(Aamir Khan). వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరస్తున్న ఈయన.. మరొకవైపు లేటు వయసులో కూడా ఘాటు ప్రేమాయణంతో నిరంతరం మీడియా హెడ్లైన్స్ లో నిలుస్తున్నారు. ముఖ్యంగా షష్టి పూర్తి చేసుకోవాల్సిన సమయంలో తన కంపెనీ ఉద్యోగి అయిన గౌరీ స్ప్రాట్ (Gauri Sprout)తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరికీ సంబంధించిన రిలేషన్ ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనికి తోడు అమీర్ ఖాన్ ఈమెతో ప్రేమాయణం కంటే ముందే రెండు వివాహాలు చేసుకొని.. విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈమెతో కాస్త చనువుగా ఉండడంతో పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని అభిమానులు ప్రతిరోజూ ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ విషయంపై స్పందించారు అమీర్ ఖాన్. తాజాగా ఆయన మాట్లాడుతూ..” గౌరీ, నేను ఒకరి విషయంలో ఒకరం చాలా సీరియస్ గా ఉన్నాము. మేము ప్రస్తుతం కలిసే ఉంటున్నాము. ఇప్పుడు భాగస్వాములను కూడా అయ్యాము. మేము మానసికంగా కలిసే ఉన్నాం. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో మునుముందు ప్రయాణంలో నిర్ణయించుకుంటాము” అంటూ అమీర్ ఖాన్ తెలిపారు. అయితే ఈ విషయం విన్న తర్వాత అభిమానులు ఇది సంతోషకరమైన శుభవార్త లేక ఆశ్చర్యమా అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే లేటు వయసులో తోడు కోరుకోవడం తప్పులేదు. ఒకరకంగా ఇది సంతోషకరమైన వార్త అని చెబుతుండడంతో మరికొంతమంది ఈ వయసులో కూడా మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుండడం నిజంగా ఆశ్చర్యకరం అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
అయితే గతంలో మాత్రం.. నేను వృద్ధుడిని అయిపోయాను. నాకు మూడో పెళ్లి చేసుకునే ఆసక్తి లేదు. ఇకపై పెళ్లాడను” అని చెప్పిన అమీర్ ఖాన్.. ఆ తర్వాత థెరపీ చేయించుకొని దీని నుంచి బయటపడ్డాను. తొందరలోనే గౌరీని పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పడంతో అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మూడో పెళ్లిపై అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
అమీర్ ఖాన్ సినిమాలు..
అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. నటన రంగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఈయన..4 నేషనల్ అవార్డులతో పాటు 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అంతేకాదు భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ 2003లో అందుకున్న అమీర్ ఖాన్.. 2010లో పద్మభూషణ్ అవార్డును కూడా దక్కించుకున్నారు.
అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం..
ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1986లో రినా దత్తాను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ 2002లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఇక 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్న ఈయన.. 2021లో ఆమెకు కూడా విడాకులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వీరికి ఇరా, జునైద్ ఖాన్, ఆజాద్ రావు అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ALSO READ:Shine Tom chacko: నటికి బహిరంగ క్షమాపణ చెప్పిన దసరా విలన్.. నటి రియాక్షన్ అదుర్స్!