IBPS RRB Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. ముఖ్యంగా బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సంస్థ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు- వెకెన్సీలు, విద్యార్హత, జీతం, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, వయస్సు తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) సంస్థ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్‌బీ) లో నియామకాల కోసం 13,217 పోస్టుల వెకెన్సీతో సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ XIV నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 13,217
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ లో ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టిపర్పస్), ఆఫీసర్లు (స్కేల్ I, II & III) పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు- వెకెన్సీలు..
ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్): 7972 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 3907 పోస్టులు
ఆఫీస్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్): 50 పోస్టులు
ఆఫీస్ స్కేల్-II (లా): 48 పోస్టులు
ఆఫీస్ స్కేల్-II (సీఏ): 69 పోస్టులు
ఆఫీస్ స్కేల్-II (ఐటీ): 87 పోస్టుల
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 854 పోస్టులు
ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్): 15 పోస్టులు
ఆఫీసర్ స్కేల్ II (ట్రేజరీ మేనేజర్): 16 పోస్టులు
ఆఫీసర్ స్కేల్ III: 199 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ పాసై ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం కూడా ఉండాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: సెప్టెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 29
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్దారించారు. ఆఫీస్ అసిస్టెంట్‌కు 18- 28 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ Iకు 18-30 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ IIకు 21- 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ IIIకు 21 నుంచి40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం
ఆఫీస్ అసిస్టెంట్: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు.
ఆఫీసర్ స్కేల్ I: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
ఆఫీసర్ స్కేల్ II & III: సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తు ఫీజు: రూ.850 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://ibps.in/