Sandeep Reddy Vanga Love Story: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సందీప్ రెడ్డి (Sandeep Reddy)ఒకరు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇదే సినిమాని కబీర్ సింగ్ సినిమాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి రీమేక్ చేసి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో మరో హిట్ కొట్టిన సందీప్ రెడ్డి త్వరలోనే ప్రభాస్ హీరోగా స్పిరిట్(Spirit) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
జగపతిబాబు షోలో వర్మ, సందీప్ రెడ్డి..
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.. ఇలా ఉండగా తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి జగపతిబాబు(Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా మరొక దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ragopal Varma)కూడా హాజరయ్యారు తాజాగా కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా సందీప్ రెడ్డి తన లవ్ స్టోరీ గురించి కూడా బయటపెట్టారు.
ఎవరా ప్రీతి?
ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. ప్రీతి ఎవరు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సందీప్ రెడ్డి సమాధానం చెబుతూ.. నాకు బాగా గుర్తుంది. అది వర్షాకాలం అప్పటికే నా డ్రెస్ మొత్తం బురద బురద అయింది. అలా నన్ను చూసి ప్రీతి నవ్వటంతో తనని ఓవర్టేక్ చేసి మరి చేతులు వదిలేసాను.. ఆ ఏజ్ లో అది అలా జరిగిపోయింది. 5th క్లాస్ అంటే కొంచెం అవేర్నెస్ వచ్చి ఉంటుంది అంటూ తాజాగా లవ్ స్టోరీ గురించి సందీప్ రెడ్డి బయట పెట్టడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక వర్మకు సంబంధించి మరొక విషయాన్నీ కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. వర్మ నేను చాలా సైలెంట్ ప్రేమికుడని చెప్పడంతో వెంటనే వర్మకు సంబంధించి ఒక వాయిస్ కాల్ ప్లే చేశారు.
ఇందులో భాగంగా ఒక అమ్మాయి మాట్లాడుతూ మనం మాట్లాడుకుని దాదాపు 40 సంవత్సరాలకు పైగా అవుతుంది. కానీ నీ ఇంపాక్ట్ నా మీద ఎప్పటికీ ఉంటుంది అంటూ మాట్లాడటంతో వర్మ ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా నీ రీసర్చ్ తగలడా… ఎక్కడెక్కడ సర్చ్ చేసి ఏం తీసుకొచ్చావు అంటూ రాంగోపాల్ వర్మ జగపతిబాబుపై సరదాగా మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో ఈ ముగ్గురి మధ్య ఎంతో సరదాగా సాగిపోయింది అయితే ఈ ముగ్గురు ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడుకున్నారు ఏంటి అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతుంది.
Also Read: Kishkindapuri: తూచ్ మా సినిమా వాయిదా లేదు… మిరాయ్ కు పోటీగానే