2027 నుంచి దశలవారీగా అన్ని ప్యాసింజర్, గూడ్స్ వెహికల్స్‌లో EDR సిస్టమ్‌ను తప్పనిసరి చేయనుంది కేంద్రం. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. MoRTH నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఫ్లైట్‌లో ఉండే బ్లాక్ బాక్స్‌లా.. EDR కూడా ప్రమాద సమయంలో కీలక సమాచారాన్ని సేవ్ చేస్తుంది.
కారు ప్రమాదానికి ముందు ఎలా ఉంది? ప్రమాదం తర్వాత ఏం జరిగింది? అనే విషయాలపై మాత్రం క్లియర్ డేటా ఇస్తుంది. అంటే యాక్సిడెంట్‌కు ముందు 5 సెకన్లలో కారు ఎంత స్పీడ్‌లో ఉంది? బ్రేకులు వేశారా? స్టీరింగ్‌ను ఏ వైపు తిప్పారు? సీట్‌బెల్ట్ పెట్టుకున్నారా? ఇలాంటి ప్రతి కీలక వివరాన్ని EDR రికార్డ్ చేస్తుంది. అయితే.. ఇది వాయిస్ రికార్డ్ చేయదు. కానీ పక్కా డేటాను ఇది డిజిటల్ ప్రూఫ్‌గా రికార్డ్ చేసి ఉంచుతుంది.
ఈ EDR వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే.. యాక్సిడెంట్ జరిగినప్పుడు విచారణ చాలా ఈజీ అయిపోతుంది. డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉందా? లేక వెహికల్ ఫెయిల్యూర్ ఉందా? అనేది కచ్చితంగా తెలిసే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఫేక్ కేసెస్ తగ్గుతాయి, ఫాల్స్ బ్లేమ్స్ ఉండవు. అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా చాలా ఫాస్ట్‌గా క్లియర్ అవుతాయి. అంతేకాకుండా, ఈ డేటాను అనలైజ్ చేసి ఫ్యూచర్‌లో మరింత సేఫ్ కార్లను డిజైన్ చేయడానికి ఆటోమొబైల్ కంపెనీలకు ఉపయోగపడుతుంది. డేటా ప్రైవసీకి ప్రాధాన్యమిస్తూ, కేవలం లీగల్ ఇన్వెస్టిగేషన్స్ కోసమే ఈ డేటాను వాడుకునేలా గైడ్‌లైన్స్ రెడీ చేస్తున్నారు.
కేవలం EDR మాత్రమే కాకుండా.. డ్రైవర్లు, ప్రయాణికులు, చివరికి రోడ్డుపై నడిచే పాదచారుల భద్రత కోసం కేంద్రం మరికొన్ని కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. కారు ముందు నుంచి లేదా సైడ్ నుంచి ఢీకొన్నప్పుడు లోపల ఉన్నవారికి తీవ్ర గాయాలు కాకుండా ఉండేలా స్పెషల్ క్రాష్ టెస్ట్ ప్రమాణాలు తెస్తున్నారు. ఇవి కొత్త మోడళ్లకు 2027 అక్టోబర్ 1 నుంచి, అన్ని మోడళ్లకు 2028 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. యాక్సిడెంట్ ధాటికి ప్రయాణికులు ముందుకు ఎగిరిపడకుండా ఉండే అడ్వాన్స్డ్ సీట్‌బెల్ట్ సిస్టమ్ రూల్స్ 2029 అక్టోబర్ నుంచి రానున్నాయి.
Also Read: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? బ్యాటరీ గురించి ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!
కారు ఢీకొంటే పాదచారుల కాళ్లకు తీవ్ర గాయాలు కాకుండా FPLI అనే పరికరంతో కొత్త ప్రమాణాలు తీసుకొస్తున్నారు. ఇవి 2028 నుంచి కొత్త కార్లలో, 2032 నాటికి అన్ని వాహనాల్లో వస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు షార్ట్ సర్క్యూట్స్, ఇంధన లేదా కరెంట్ ప్రమాదాలు రాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను 2029 ఏప్రిల్ నుంచి అమల్లోకి తేనున్నారు. చివరికి ఈ EDR సిస్టమ్ అన్ని మోడళ్ల కార్లకు 2029 అక్టోబర్ 1 నాటికి కంప్లీట్‌గా మ్యాండేటరీ కానుంది.