E-Paper
Advertisement

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత
Advertisement

Samantha -Raj Nidimori: సినీ నటి సమంత ప్రస్తుతం సినిమాల పరంగా ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే .మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా సమంత ప్రెగ్నెంట్ కావడంతో తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన అన్ని విషయాలను అలాగే మాతృత్వపు అనుభూతులను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు..

పిల్లల కంటే అన్యోన్యత ముఖ్యం అనుకున్నాం..

Advertisement

ఇకపోతే తాజాగా సమంత ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా ప్రస్తావించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్ తో వివాహం అయిన వెంటనే సమంత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అందరికీ తెలిపారు. అయితే తాజాగా ఈమె పిల్లల గురించి మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో మాకు పిల్లలు ఉన్న, లేకపోయినా పర్వాలేదు అనుకున్నాము. కానీ జీవితాంతం రాజ్ తో నా అన్యోన్యత ముఖ్యమని భావించినట్లు సమంత తెలియచేశారు. పిల్లల విషయంలో మాకు ముందస్తు ఎలాంటి ప్రణాళికలు కూడా లేవని సమంత తెలిపారు.

పిల్లల కోసం ప్లాన్ చేసుకోలేదు..

ఇలా పిల్లల కోసం ముందస్తు ప్రణాళికలు లేకపోయినప్పటికీ తాను ప్రెగ్నెంట్ అవ్వడం అనేది తమ జీవితంలో ఊహించని ఆనందాన్ని తీసుకువచ్చిందని సమంత తెలియజేశారు. త్వరలోనే రాబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నామని, అయితే అమ్మాయి పడుతుందా? లేదా అబ్బాయి పుడతారా? అనే విషయాలను పక్కనపెట్టి ఎలాంటి తారతమ్యం లేకుండా మా బిడ్డను పెంచుతాం అంటూ సమంత తెలిపారు. ఇలా పిల్లల గురించి సమంత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సమంత గత ఏడాది డిసెంబర్ లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే.

సినిమాలకు చిన్నవిరామం…

Advertisement

ఇలా డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్న ఈమె జూన్ నెలలో తన ప్రెగన్సీ గురించి అందరితో పంచుకున్నారు. ఇలా సమంత తన మొదటి బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఇక సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కొద్ది రోజులపాటు ఒంటరిగా ఉంటూ అనంతరం రాజ్ ను రెండవ వివాహం చేసుకున్నారు. ఇక రాజ్ కు కూడా ఇది రెండవ వివాహం అనే సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత సమంత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుందని భావించారు కానీ ఈమె మాత్రం మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అవడంతో ప్రస్తుతం సినిమాలకు చిన్నవిరామం ప్రకటించారు.

Also Read: నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Related News

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

Big Stories

Advertisement
×