E-Paper
Advertisement

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!
Advertisement

Jayam Ravi wife Arthi: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వారిలో నటుడు జయం రవి(Jayam Ravi) ఒకరు. ప్రస్తుతం ఈయన నటుడిగా నిర్మాతగా కొనసాగుతూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్న జయం రవి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయనకు గత కొద్ది రోజులుగా తన భార్య ఆర్తితో విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా వీరి మధ్య తలెత్తిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

కోర్టులో విడాకుల వ్యవహారం..

ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం కోర్టులో ఉంది. ఇలా విడాకులకు అప్లై చేయడంతో గత కొద్దిరోజులుగా జయం రవి ఆయన భార్య విడివిడిగానే ఉంటున్నారు. ఇక తరచూ రవి భార్య ఆర్తి (Arthi)తన భర్తను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా సంచలనమైన పోస్టులు చేస్తున్నారు.నేడు జయం రవి పుట్టినరోజు కావడంతో ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా చేసిన ఒక పోస్ట్ మాత్రం చర్చలకు కారణమైంది. పరోక్షంగా తన భర్తను తమిళ చిత్ర పరిశ్రమలోని గొప్ప నటులతో పోలుస్తూ కాస్త వ్యంగ్యంగా పోస్ట్ చేస్తూ అతని నటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటూ ఈమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఆ వ్యక్తి నటనకు ఆస్కార్ ఇవ్వచ్చు..

Advertisement

” సూర్య, అజిత్, విక్రమ్, కమల్ హాసన్ వీళ్ళందరి కంటే కూడా నా జీవితంలోకి వచ్చిన ఒకరు చేసిన యాక్టింగ్ కు కచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇచ్చేయొచ్చు” అంటూ ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ పోస్ట్ షేర్ చేశారు. అయితే ఈ పోస్టులో ఆర్తి ఎక్కడ కూడా జయం రవి పేరును ప్రస్తావించలేదు. కానీ ఈమె చేసిన పోస్ట్ చూస్తుంటే అది తన భర్తను ఉద్దేశించి చేశారని ఆయన తనకు చేసిన మోసాన్ని ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. రవి ఆర్తి 2009వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు దాదాపు 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ దంపతులు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

ప్రియురాలితో జంటగా జయం రవి..

ఇలా సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు గత రెండు సంవత్సరాల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా జయం రవి ఆర్తి విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగానే జయం రవి మాత్రం సింగర్ కెనీషాతో రిలేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి గురించి ఇలాంటి రూమర్లు రావడమే కాకుండా ఎక్కడికి వెళ్లినా జంటగా కలిసి కనిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్ గురించి పెద్ద ఎత్తున కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక తాజాగా తన భార్య చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక జయం రవి పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఆయన నటిస్తున్న వడ్డీ కాసులవాడా నుంచి ఒక ప్రత్యేకమైన పోస్టర్ విడుదల చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×