E-Paper
Advertisement

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Korean Action Thriller: ఒక తండ్రి తన పిల్లలను స్కూల్‌ కి తీసుకెళ్తుంటే కారులో ఒక్కసారిగా ఓ ఫోన్ మోగితే ? ఫోన్ రావడం కామన్… కానీ ఆ కాల్ చేసిన వ్యక్తి, కారు సీట్ల కింద బాంబులు ఉన్నాయని చెబితే ? అంతేకాదు… కారు నుంచి బయటకు వస్తే పేలిపోతుందని హెచ్చరిస్తే ? అసలు ఆ బాంబులు ఎవరు పెట్టారు ? ఆ ఫోన్ కాల్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ? తన పిల్లలను కాపాడుకోవడానికి ఆ తండ్రి ఏం చేశాడు ? పోలీసులే అతడిని నిందితుడిగా అనుమానిస్తే పరిస్థితి ఎలా మారుతుంది ? ఈ ప్రశ్నలకు సమాధానమే కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ Hard Hit. మరి ఇంతకీ ఈ యాక్షన్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలోకి రాబోతోంది ? తెలుగులో చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సుంగ్ – గ్యు ఓ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్. ఓ రోజు ఉదయం తన పిల్లలను కారులో ఎక్కించుకుని స్కూల్‌ కి బయలుదేరుతాడు. అంతా సాధారణంగానే ఉందనుకుంటున్న సమయంలో అతని ఫోన్‌ కు ఓ అపరిచిత కాల్ వస్తుంది. కాల్ చేసిన వ్యక్తి సుంగ్ – గ్యు కారులో బాంబులు అమర్చినట్టు చెబుతాడు. కారు నుంచి ఎవరైనా దిగినా, చెప్పిన డబ్బు ఇవ్వకపోయినా బాంబులు పేలిపోతాయని హెచ్చరిస్తాడు. మొదట ఇదంతా ప్రాంక్ అనుకున్న సుంగ్ – గ్యు… తన కళ్ల ముందే మరో కారులో జరిగిన పేలుడును చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు అతనికి ఒక్కటే దారి. కారును ఆపకుండా, పిల్లలతో సహా లోపలే ఉండాలి. ఇంతలో బాంబు పేలుడుతో అతని కొడుకు తీవ్రంగా గాయపడతాడు.

Advertisement

కానీ అతన్ని హాస్పిటల్‌ కు తీసుకెళ్లేందుకు కూడా కారు దిగే పరిస్థితి ఉండదు. డబ్బు సమకూర్చుకునేందుకు సుంగ్ – గ్యు ప్రయత్నిస్తుండగా, పోలీసులు కూడా అతని చుట్టూ చేరతారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. కాలర్ వేసిన పక్కా ప్లాన్ కారణంగా పోలీసులకు సుంగ్ – గ్యునే కిడ్నాపర్, బాంబర్‌ లా కనిపిస్తాడు. ఒకవైపు పోలీసులు… మరోవైపు కారులో ప్రాణాంతకమైన బాంబు… మధ్యలో తన పిల్లలు. ఈ పరిస్థితిలో సుంగ్ – గ్యు ఏం చేస్తాడు ? అసలు అతన్ని టార్గెట్ చేసింది ఎవరు ? అతని గతానికి ఈ ప్రమాదానికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలను చివరి వరకు ఉత్కంఠగా నడిపిస్తూ సినిమా క్లైమాక్స్‌ కు చేరుతుంది.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

‘హార్ట్ హిట్’ 2021లో వచ్చిన సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్. కిమ్ చాంగ్-జు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో Jo Woo-jin, Ji Chang-wook ప్రధాన పాత్రల్లో నటించారు. 2015 స్పానిష్ చిత్రం Retributionకు ఇది కొరియన్ రీమేక్. ప్రస్తుతం Amazon Prime Videoలో కొరియన్‌ తో పాటు తెలుగు, హిందీ, తమిళ ఆడియోలతో చూడొచ్చు. అలాగే VROTTలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. వేగంగా సాగే కథనం, వరుస ట్విస్టులు, కారులోనే చిక్కుకుపోయిన తండ్రి చుట్టూ నడిచే టెన్షన్ తో ఈ మూవీ మంచి థ్రిల్ ఇస్తుంది.

Advertisement

Read Also: భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

Tags

Related News

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

Big Stories

Advertisement
×