E-Paper
Advertisement

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం
Advertisement

Student Rights: పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన చేతులతో పెద్ద పెద్ద బాక్సులు విద్యార్థులు మోస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో పనులు చేయిస్తున్న సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం స్థానిక రెండు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో బాక్సులు మోయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక పాఠశాలలో విద్యార్థులు బాక్సులను మోసి రిక్షాలో పెట్టగా మరో పాఠశాలలో రిక్షాలో ఉన్న బాక్సులను విద్యార్థుల చేత మోయించి పాఠశాలలోకి తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి.

తల్లిదండ్రులు ఆవేదన..

చదువుకోవడానికి పాఠశాలకు వచ్చే విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలను చదువుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని పాఠశాలకు పంపుతున్నామని.. పనులు చేయించుకోవడానికి కాదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంతటి ప్రోత్సాహక చర్యలు చేపడుతున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు రావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Advertisement

Also read: బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

రవిచంద్రన్ ఆగ్రహం వ్యక్తం..

విద్యార్థుల హక్కులను పరిరక్షించాల్సిన పాఠశాల సిబ్బందే వారితో ఇలాంటి పనులు చేయించడం సరికాదని మానవ హక్కుల సంఘం చైర్మన్ బొంగరాల రవిచంద్రన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఘటనలను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని బొంగరాల రవిచంద్రన్ తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేది విద్యను అభ్యసించడానికి.. పాఠశాల నిర్వహణకు సంబంధించిన బరువులు మోయడానికి కాదని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Also read: జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

Tags

Related News

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×