Sampradayini Suppini Suddapoosani: శివాజీ రీ ఎంట్రీలో చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఆయన చేసిన సినిమాల్లో పాత్రలన్నీ మంచి గుర్తింపును తెచ్చుకుని, శివాజీ స్థాయిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ హీరో శివాజీ (Sivaji), హీరోయిన్ లయ (Laya) జంటగా నటిస్తున్న చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani). శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ (Sree Sivaji Productions) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ (Sudheer Sriram) రచన దర్శకత్వం వహించారు. 90స్ వెబ్ సిరీస్‌లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్‌తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న డైరెక్ట్ ఈటీవి విన్ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం (ఫిబ్రవరి 07) థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read- Rashmika Mandanna: డార్క్ పాత్రలో రష్మిక.. AA24 సినిమాలో ఎప్పుడూ లేనంత వైలెంట్‌గా..!
అనగనగా ఒక పంచాయతీ సెక్రటరీ.. పేరు శ్రీరామ్.. అంటూ శివాజీ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ‘ఒక్కడ ఒప్పుకోకపోయినా సంతకం పెట్టను’, ‘నీతి, నిజాయితీ అని నాకు బాగా కావాల్సిన వాళ్లులే’ అనే డైలాగ్స్‌తో శ్రీరామ్ పాత్ర తాలుకా నిజాయితీని తెలియజేశారు. భర్తకు తగ్గ భార్య ఉత్తర అంటూ లయ పాత్రని పరిచయం చేశారు. ‘అతనెవరో డబ్బులిస్తానంటే వద్దన్నారంట’ అంటూ శివాజీ శాసించే పాత్రని ఇందులో ఆమె చేసినట్లుగా రివీల్ చేశారు. తండ్రి మాట దాటని కొడుకు అంటూ రోహన్ పాత్రని చాలా వైలెంట్‌గా పరిచయం చేసి, కూల్ సన్ అని ట్యాగెట్టారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. అసలైన ‘దృశ్యం’ అక్కడి నుంచే మొదలవుతోంది. ఒకరిని చంపడం, శవాన్ని దాచిపెట్టడం.. అంతా వెంకటేష్ ‘దృశ్యం’ సినిమాను చూస్తున్నట్టే ఉంటుంది కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్‌ను కూడా ప్లాన్ చేశారు. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ఉత్కంఠ భరితంగా రూపుదిద్దుకున్న ఈ క్రైమ్ కామెడీ సినిమా చూడాల్సిందే అనేలా ట్రైలర్‌ని కట్ చేశారు.
Also Read- Allu Arjun: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బన్నీ ధరించిన షర్టు, వాచ్ ఖరీదు తెలిస్తే షాక్!
కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని పాత్రలో లయ ఈ సినిమాలో చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె పాత్రే ఈ సినిమాకు ప్రధానం అనేలా ట్రైలర్ తెలియజేస్తుంది. అమ్మ, కొడుకు కలిసి శ్రీరామ్ పాత్రతో ఏం చేయించారు? ఆ తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాలు ఏంటనేదే.. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా హై స్టాండర్ట్స్‌లో రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే రంజిన్ రాజ్ సంగీతం కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుందనేది ట్రైలర్‌తో అర్థమవుతోంది. రీ ఎంట్రీలో శివాజీకి మరో హిట్ సినిమాగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాకపోతే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడం లేదు కాబట్టి.. ఈటీవీ విన్ వీక్షకుల ఆదరణను రాబట్టుకుని, మంచి సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలుస్తుందని మాత్రం చెప్పొచ్చు.
Also Read- Hero Arjun: 46 ఏళ్ల కెరియర్లో చుట్టూ ఉన్నవాళ్లే నమ్మించి మోసం చేశారు.. హీరో అర్జున్ ఆవేదన