E-Paper
Advertisement

Non Inverter AC: ఇన్వర్టర్ AC vs నాన్-ఇన్వర్టర్ AC.. ఏది కొనాలి? మీ బెడ్‌రూమ్‌కు ఏది బెస్ట్?

Non Inverter AC: ఇన్వర్టర్ AC vs నాన్-ఇన్వర్టర్ AC.. ఏది కొనాలి? మీ బెడ్‌రూమ్‌కు ఏది బెస్ట్?
Advertisement

Non Inverter AC| కొత్త ఎయిర్ కండీషనర్ కొనేటప్పుడు అందరికీ కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. అందులో అతి పెద్ద ప్రశ్న ఇన్వర్టర్ ACకి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలా? లేక చవకైన నాన్-ఇన్వర్టర్ మోడల్ తీసుకోవాలా? అని. ఈ నిర్ణయం మీ విద్యుత్ బిల్లు, సౌలభ్యం, దీర్ఘకాలిక సేవింగ్స్‌పై ప్రభావం చూపుతుంది. ఆన్‌లైన్‌లో ఎన్నో మోడల్స్ ఉండటంతో ఎంపిక చేయడం ఇంకా కష్టమవుతుంది. రెండు రకాల ACల గురించి సరిగ్గా తెలుసుకుంటే మీ పెట్టుబడికి తగిన విలువ లభిస్తుంది.

నాన్-ఇన్వర్టర్ AC అంటే ఏమిటి?

నాన్-ఇన్వర్టర్ ACలో ఫిక్స్‌డ్ స్పీడ్ కంప్రెసర్ ఉంటుంది. రూమ్ టెంపరేచర్ చేరిన తర్వాత కంప్రెసర్ పూర్తిగా ఆగిపోతుంది. రూమ్ మళ్లీ వేడెక్కినప్పుడు ఏసీ మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఆన్-ఆఫ్ ఇలా జరుగుతుంది.

నాన్-ఇన్వర్టర్ AC లాభాలు

Advertisement

ధర చాలా తక్కువగా ఉంటుంది. స్పేర్ పార్ట్స్ సులభంగా, చవకగా దొరుకుతాయి. రిపేర్ ఖర్చు తక్కువ. తక్కువగా AC వినియోగించే వారికి ఇది సరిపోతుంది. సింపుల్ డిజైన్ కాబట్టి టెక్నికల్ సమస్యలు తక్కువ.

నాన్-ఇన్వర్టర్ AC నష్టాలు

ఎలక్ట్రిసిటీ ఎక్కువ తింటుంది (ఆన్-ఆఫ్ ఎక్కువగా జరుగుతుంది). లాంగ్ టైమ్ ఉపయోగిస్తే బిల్లు ఎక్కువ వస్తుంది. ఆన్-ఆఫ్ అయినప్పుడు శబ్దం ఎక్కువగా వస్తుంది. కూలింగ్ స్థిరంగా ఉండదు. ఎక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్ ఉంటుంది. చాలా బ్రాండ్లు ఇప్పుడు ఈ మోడల్స్‌ను తగ్గిస్తున్నాయి.

ఇన్వర్టర్ AC అంటే ఏమిటి?

Advertisement

ఇన్వర్టర్ ACలో వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ఉంటుంది. రూమ్ టెంపరేచర్ ప్రకారం కంప్రెసర్ స్పీడ్ తగ్గుతుంది లేదా పెరుగుతుంది. పూర్తిగా ఆగదు. ట్రాఫిక్‌లో బైక్ స్పీడ్ మార్చినట్టు పనిచేస్తుంది.

ఇన్వర్టర్ AC లాభాలు

30 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. రూమ్ టెంపరేచర్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. కూలింగ్ చాలా త్వరగా మొదలవుతుంది. కంప్రెసర్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తుంది.

ఇన్వర్టర్ AC వల్ల నష్టాలు

ఇన్వర్టర్ ACల ధర ఎక్కువగా ఉంటుంది. వారంటీ అయిపోయాక రిపేర్ ఖర్చు కూడా ఎక్కువ. అధునాతన ఎలక్ట్రానిక్స్ కాబట్టి స్కిల్డ్ టెక్నీషియన్ అవసరం. కొన్ని సందర్భాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ కూడా కొంచెం ఖరీదైనది.

Also Read: ఆపిల్ కంపెనీలో పనిచేసే భారతీయుడికి రూ.200 కోట్లకు పైగా వేతనం.. సిఈఓ సాలరీ ఎంతో తెలుసా?

ఏ ఏసి కొనాలి?

రోజూ 6 గంటల కంటే ఎక్కువ సేపు AC వినియోగించేవారు.. ఇన్వర్టర్ AC తీసుకోవాలి. దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. నిశ్శబ్దంగా, స్థిరమైన కూలింగ్ ఇస్తుంది. రోజుకు 1-2 గంటలు మాత్రమే ఉపయోగించేవారు నాన్-ఇన్వర్టర్ AC తీసుకోవచ్చు. ధర కూడా తక్కువే.

ఇన్వర్టర్ AC.. సౌలభ్యం, దీర్ఘకాలిక విద్యుత్ బిల్లు సేవింగ్స్ కోసం బెస్ట్. నాన్-ఇన్వర్టర్ AC.. తక్కువ సేపు వినియోగించేవారికి సరిపోతుంది. LG, వోల్టాస్, లాయిడ్ వంటి బ్రాండ్లలో నమ్మకమైన మోడల్స్ ఉన్నాయి. ఎనర్జీ రేటింగ్, రివ్యూలు చూసి కొనాలి. మీ ఉపయోగం ప్రకారమే ఫైనల్ ఛాయిస్ చేయాలి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×