E-Paper
Advertisement

Samyukta Menon: యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టనున్న సంయుక్త.. ఫస్ట్ లుక్ అదుర్స్..

Samyukta Menon: యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టనున్న సంయుక్త.. ఫస్ట్ లుక్ అదుర్స్..
Advertisement

Samyukta Menon:సంయుక్త మీనన్ (Samyuktha Menon) విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమధ్యకాలంలో సెలెక్టివ్ గా పాత్రను ఎంచుకుంటూ.. తన సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న సంయుక్త.. తాజాగా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్స్ సందర్భంగా తాను నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

బ్లాక్ గోల్డ్ నుండి సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్..

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఈమె బ్లాక్ గోల్డ్ అనే చిత్రంలో నటిస్తోంది.. ఈ మేరకు ఈ సినిమా నుండి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ పంచుకుంటూ.. “బ్లాక్ గోల్డ్ చిత్ర బృందం తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బలం, స్థితి స్థాపకత, ధైర్యం, శక్తివంతమైన కథ.. ఈ వేసవి 2026 థియేటర్లలో వేచి ఉంది” అంటూ ఈ సినిమా సమ్మర్లో విడుదల కాబోతున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఇక ఈ పోస్టర్లో సంయుక్త మొహం మీద గాయంతో చేతిలో రివాల్వర్ పట్టుకొని సీరియస్ గా చూస్తోంది.

Advertisement

ALSO READ:Film industry: సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేతకు బిగ్ షాక్.. వెబ్ సిరీస్‌పై నిషేధం ఎత్తివేత

బ్లడీ హ్యాపీ న్యూ ఇయర్..

పైగా ఈ పోస్టర్ మీద “బ్లడీ హ్యాపీ న్యూ ఇయర్” అని రెడ్ కలర్ తో రాసి ఉండడం హైలైట్ గా మారుతోంది. మొత్తానికైతే సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ గోల్డ్ మూవీ నుంచి మేకర్స్ పంచుకున్నారు. ఈ పోస్టర్ ను బట్టి చూస్తుంటే సంయుక్త ఇందులో హై యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేశారు. మరి ఈ సినిమాలో సంయుక్త తన పెర్ఫార్మెన్స్ తో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోందో తెలియాలి అంటే ఈ సమ్మర్ వరకు ఎదురు చూడాల్సిందే.

సంయుక్త కెరియర్..

Advertisement

మలయాళ చిత్రాల ద్వారా కెరియర్ ను ప్రారంభించిన సంయుక్త మీనన్.. తెలుగు చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన నటనతో కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, సంతోషం ఫిలిం అవార్డులను కూడా దక్కించుకుంది. 2016లో వచ్చిన పాప్ కార్న్ అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కల్కి, ఎడక్కాడ్ బెటాలియన్ 06 వంటి చిత్రాలలో నటించిన ఈమె.. రానా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన భీమ్లానాయక్ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక తర్వాత బింబిసారా, విరూపాక్షా చిత్రాలతో కమర్షియల్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంది సంయుక్త. ప్రస్తుతం బ్లాక్ గోల్డ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×