E-Paper
Advertisement

Film industry: సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేతకు బిగ్ షాక్.. వెబ్ సిరీస్‌పై నిషేధం ఎత్తివేత

Film industry: సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేతకు బిగ్ షాక్.. వెబ్ సిరీస్‌పై నిషేధం ఎత్తివేత
Advertisement

Film industry:సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొంతమంది జీవిత కథల ఆధారంగా బయోపిక్లు రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే మరికొన్ని మాత్రం ఇతర వ్యక్తుల అనుమతులు లేకుండానే కొన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. కానీ అవి తెరపైకి వచ్చిన తర్వాత ఆయా పాత్రలకు సంబంధించిన వ్యక్తులు మాత్రం.. తమ అనుమతి లేకుండా ఎలా చిత్రీకరిస్తారు? అంటూ ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కుతున్న విషయం తెలిసిందే.

నా పరువుకు భంగం వాటిల్లింది -రామలింగరాజు

అయితే ఈ క్రమంలోనే గత ఐదు సంవత్సరాల క్రితం తన జీవిత కథ ఆధారంగా ఒక వెబ్ సిరీస్ నిర్మించారని.. తన పరువుకు భంగం వాటిల్లేలా చేశారని.. వెంటనే దానిని ఆపివేయాలి అని సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ మేరకు ఐదేళ్లపాటు నిలిచిపోయిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటి? దానిని నిర్మించిన సంస్థ ఏంటి ? ఇలా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

వెబ్ సిరీస్ నిలిపివేయాలంటూ కోర్టులో కేస్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజుకి బిగ్ షాక్ తగిలింది. ఆయన జీవిత కథ ఆధారంగా నిర్మించిన వెబ్ సీరీస్‌పై నిషేధం ఎత్తివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విషయంలోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ అనే వెబ్ సిరీస్ నిర్మించింది. అయితే ఈ వెబ్ సిరీస్ తన జీవిత కథ ఆధారంగా రూపొందించారని.. వెంటనే విడుదల ఆపివేయాలని ఈ వెబ్ సిరీస్ కి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన రామలింగరాజు.. ఈ వెబ్ సిరీస్ ని నిలిపివేయాలి అని కోర్టులో పిటిషన్ కూడా వేశారు.

రామలింగరాజుకి షాక్ ఇచ్చిన కోర్టు..

అలా రామలింగరాజు వేసిన పిటిషన్ కారణంగా గత ఐదేళ్ల క్రితం విడుదల కావాల్సిన ఈ వెబ్ సిరీస్ విడుదల కాకుండా నిలిచిపోయింది. కానీ తాజాగా దీనిపై విచారణ నిర్వహించిన కోర్టు ఆంక్షలు ఎత్తివేయడంతో ఈ బ్యాడ్ బిలియనీర్స్ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. వాస్తవానికి మొదట ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఇది అసత్య కథనం అని, తన పరువును దెబ్బతీసేలా ఈ వెబ్ సిరీస్ తో నిర్మించారు అంటూ సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు నెట్ ఫ్లిక్స్ పై కేసు వేశారు. దిగువ కోర్టు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు పై అప్పీల్ పెండింగ్లో ఉండగా ఇలాంటి సీరీస్ రావడం సరికాదని, తన వాదనలు కూడా వినిపించారు.

Advertisement

ALSO READ:Spirit: ప్రభాస్ ఫస్ట్ లుక్.. కాపీ అంటూ భారీ ట్రోల్స్!

వాదనలు వినిపించిన నెట్ ఫ్లిక్స్..

అయితే అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ కూడా తమ వాదనలు వినిపించింది. బహిరంగంగా ఉన్న రికార్డులు, లిఖితపూర్వక ఆధారాల ప్రకారమే ఈ సిరీస్ రూపొందించామని, రామలింగరాజు మీద మాత్రమే ఈ వెబ్ సిరీస్ తీయలేదని, విజయ్ మాల్యా, సుబ్రతోరాయ్, నీరవ్ మోడీ వంటి వారి జీవితాలపై కూడా ఈ వెబ్ సిరీస్ తీసామని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమే తమ ఉద్దేశమని కూడా నెట్ ఫ్లిక్స్ తెలిపింది.

వెబ్ సిరీస్ రిలీజ్ కి సర్వం సిద్ధం..

అలా ఇరు వాదనలు విన్న కోర్టు వెబ్ సిరీస్ పై గతంలో ఇచ్చిన స్టేని రద్దు చేస్తూ ఈ వెబ్ సిరీస్ విడుదలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు ఈ వెబ్ సిరీస్ పై గతంలో ఇచ్చిన స్టే ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ విడుదలకు మార్గం సులువైంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×