Ather Rizta Electric Scooter 2026: ఏథర్ ఎనర్జీ కంపెనీ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ 2024లో లాంచ్ అయింది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. స్పేషియస్ డిజైన్, అదిరిపోయే రేంజ్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో వినియోగదారులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. 2026 జనవరి నాటికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత ఉంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఏథర్ రిజ్టా ప్రస్తుతం మొత్తం 10 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా S, Z సిరీస్‌లలో 2.9 kWh, 3.7 kWh బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. Z వేరియంట్లు మరిన్ని ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది.
⦿ Rizta S (2.9 kWh): ధర రూ. 1,19,546
⦿ Rizta S (2.9 kWh): ధర రూ.1,21,546
⦿ Rizta Z (2.9 kWh): ధర రూ. 1,39,047
⦿ Rizta Z (2.9 kWh): ధర రూ. 1,40,047
⦿ Rizta Z (2.9 kWh): ధర రూ.1,41,047
⦿ Rizta S (3.7 kWh): ధర రూ. 1,42,047
⦿ Rizta Z (3.7 kWh): ధర రూ.1,59,046
⦿ Rizta Z (3.7 kWh): ధర రూ. 1,60,046
⦿ Rizta Z (3.7 kWh): ధర రూ. 1,61,046
ఈ ధరలు కేవలం ఎక్స్ షో రూమ్ ధరలు. ఆన్ రోడ్ ధరలు ఢిల్లీలో రూ. 1.22 లక్షల నుంచి రూ.1.72 లక్షల వరకు ఉంటుంది.
⦿ 2.9 kWh బ్యాటరీ: IDC సర్టిఫైడ్ రేంజ్ 123కిలో మీటర్లు. కానీ, రియల్ వరల్డ్ రేంజ్ సుమారు 100-105 కిలో మీటర్లు ఇస్తుంది.
⦿ 3.7 kWh బ్యాటరీ: IDC సర్టిఫైడ్ రేంజ్ 159-160 కిలో మీటర్లు. రియల్ వరల్డ్ రేంజ్ సుమారు 125 కిలో మీటర్లు ఇస్తుంది.
⦿ బ్యాటరీ వారంటీ: 5 సంవత్సరాలు లేదంటే 60,000కిలో మీటర్ల వరకు గ్యారెంటీ ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 10 నిమిషాలు ఛార్జ్ చేస్త 30కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. పూర్తి ఛార్జ్ కోసం సుమారు 8 గంటల సమయం పడుతుంది.
⦿ కలర్స్: ఏథర్ రిజ్టా మొత్తం 9 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. S వేరియంట్లు 3 కలర్లు, Z వేరియంట్లు 7 కలర్లలో ఉంటాయి.
Read Also: జస్ట్ రూ. 1.9 లక్షలు.. చీపెస్ట్ ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలో మీటర్లు ఉంటుంది. మోటార్ పవర్ 4.3 kW, టార్క్ 22 Nm ఉంటుంది. లిథియం ఐయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 7 ఇంచుల TFT టచ్ స్క్రీన్ డాష్‌బోర్డ్, బ్లూటూత్, నావిగేషన్, వాయిస్ అసిస్ట్, క్రికెట్ స్కోర్ ఆన్ డాష్, వాట్సాప్ ఆన్ డాష్, థెఫ్ట్ అలర్ట్స్, ఫాల్ సేఫ్, స్కిడ్ కంట్రోల్, ఆటోహోల్డ్, రివర్స్ మోడ్, మ్యాజిక్ ట్విస్ట్, USB ఛార్జింగ్, 56L స్టోరేజ్, పిలియన్ బ్యాక్‌రెస్ట్, అలెక్సా స్కిల్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఉంటుంది.
Read Also: లక్షలోపు ధర, 50 కి.మీ మైలేజ్.. ఈ హీరో స్కూటర్ గురించి తెలుసా?