E-Paper
Advertisement

ఈవీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక అపార్ట్ మెంట్ లోనే ఛార్జింగ్ సౌకర్యం!

ఈవీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక అపార్ట్ మెంట్ లోనే ఛార్జింగ్ సౌకర్యం!
Advertisement

EV Charging at Home: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. నగరాల్లో నివసించే ప్రజలకు ఈవీల వినియోగం మరింత సులభం కావాలనే ఉద్దేశంతో, అపార్ట్‌ మెంట్లలోనే ఛార్జింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా నిర్మించే అపార్ట్‌ మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల బేస్‌ మెంట్ లేదంటే పార్కింగ్ ప్రదేశాల్లో తప్పనిసరిగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈవీల వాడకాన్ని పెంచే దిశగా చర్యలు

ఈవీల వినియోగాన్ని పెంచే అంశంపై సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు ఈవీ మౌళిక సదుపాయాల పెంపు ప్రణాళికను చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమావేశానికి అధ్యక్షత వహించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ కొత్త విధానంపై వివరాలు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈవీల వాడకం వేగవంతం కావాలని అధికారులు అభిప్రాయపడ్డారు.

ప్రతి అపార్ట్ మెంట్ లో ఈవీ పాయింట్

Advertisement

ప్రస్తుతం చాలా మంది ఈవీ వాహనదారులు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకాల్సి వస్తోంది. ఈ విధానం వల్ల టైమ్ వేస్ట్ కావడంతో పాటు కొన్నిసార్లు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, ఇంటి దగ్గరే ఛార్జింగ్ సదుపాయం ఉంటే వాహనదారులకు చాలా సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే భవిష్యత్తులో నిర్మాణం అయ్యే ప్రతి పెద్ద భవనంలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.

ఈవీ పాయింట్ల కోసం రియల్ టైమ్ డాష్ బోర్డు

రాష్ట్రంలో ఉన్న అన్ని ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌ ను అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ డాష్‌ బోర్డ్ ద్వారా ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది? అది అందుబాటులో ఉందా? లేదా? అనే సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. దీని వల్ల వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

ప్రభుత్వం సమాలోచనలు జరపుతున్న ఈ కొత్త నిర్ణయం అమలులోకి వస్తే, తెలంగాణలో ఈవీ వాహనాల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు తమ ఇళ్ల దగ్గరే సులభంగా వాహనాలను ఛార్జ్ చేసుకునే సౌకర్యం పొందుతారు. ఈ విధానం వల్ల పర్యావరణానికి మేలు కలగడంతో పాటు, ఇంధన ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది.

Read Also: వెహికల్ మీద కులం పేరు రాస్తున్నారా? అయితే, ఇక దబిడి దిబిడే!

Related News

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

Big Stories

Advertisement
×