Idiot Movie: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ఇడియట్ (Idiot Movie)ఒకటి. ఈ సినిమా 2002 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రవితేజ రక్షిత జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమాలో కమెడియన్ అలీ నటన కూడా అద్భుతమని చెప్పాలి. ముఖ్యంగా ఇసుక సన్నివేశానికి సంబంధించిన సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇలా ఈ ఇసుక సీన్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నటుడు ఆలీ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇడియట్ సినిమాలో ఇసుక సీన్ షూట్ చేసే సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకటే వర్షం పడుతూనే ఉందని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్షం ఆగిపోతే ఈ సీక్వెన్స్ షూటింగ్ ప్రారంభించామని ఈ ఇసుక సీక్వెన్స్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం కేవలం నాలుగు గంటల్లోనే పూర్తి చేశామని తెలిపారు.
ఇలా భారీ సీక్వెన్స్ నాలుగు గంటల షూట్ చేయడం అంటే నిజంగా గ్రేట్ అంటూ అలీ తెలియజేశారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా రెండు కెమెరాలతో ఈ షూటింగ్ చాలా త్వరగా పూర్తి చేసామని తెలిపారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ఇసుక సీన్ కు చాలా మంచి ఆదరణ వచ్చిందని అలాగే ఈ సినిమాలో నటించినందుకు తనకు ఒక ఫిలింఫేర్ అవార్డుతో పాటు వంశీ బర్కిలీ అవార్డు (Vamsi Berkley Award) కూడా వచ్చిందని అలీ తెలియ చేశారు. ప్రస్తుతం అలీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ కావడంతో ఈ సీక్వెన్స్ కేవలం నాలుగు గంటలలో మాత్రమే చేశారని అదే రాజమౌళి అయితే నాలుగు రోజులు చేసేవారు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఇలా పూరి జగన్నాథ్ ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం ఈయన డైరెక్షన్లో విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఆలీ విషయానికి వస్తే ఈయన ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. కేవలం కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఇక అలీ వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.
Also Read: Tharun Bhascker: ఆ విషయం వినగానే కుప్పకూలిపోయాను..తరుణ్ భాస్కర్ ఎమోషనల్!