E-Paper
Advertisement

Spirit Movie: స్పిరిట్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి.. ఈసారి మాట తప్పరు కదా?

Spirit Movie: స్పిరిట్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి.. ఈసారి మాట తప్పరు కదా?
Advertisement

Spirit Movie : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy)యానిమల్ సినిమాతో హిట్ కొట్టి అనంతరం ప్రభాస్(Prabhas) తో స్పిరిట్ (Spirit)సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గత ఏడాది ప్రకటించిన ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు ప్రారంభం కాలేదు. దీంతో సినిమా అప్డేట్ గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి సెప్టెంబర్ లో షూటింగ్ కన్ఫామ్ అంటూ చిత్ర బృందం వెల్లడించినప్పటికీ ఇంతవరకు షూటింగ్ పనులు ప్రారంభం కాలేదు.

స్పిరిట్ షూటింగ్ పై అప్డేట్..

ఇకపోతే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా స్పిరిట్ సినిమా నుంచి ఒక ఆడియో టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేయడమే కాకుండా సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి కూడా తెలియజేశారు ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గాను అలాగే ఖైదీగా కూడా కనిపించబోతున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేశారు. తాజాగా సందీప్ రెడ్డి ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సందీప్ రెడ్డి జిగ్రీస్ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్పిరిట్ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ నెలాకరిలో స్పిరిట్ షూటింగ్..

Advertisement

స్పిరిట్ సినిమా తప్పకుండా ఈ నెల ఆఖరి నుంచి షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని సందీప్ రెడ్డి తెలియజేయడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఈసారైనా మాట తప్పవు కదా వంగ మామా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈనెల చివరిన ప్రారంభం కాబోయే ఈ షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటారా లేదంటే ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ప్రభాస్..

Advertisement

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి నటించబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రకాష్ రాజ్ వివేక్ ఒబెరాయ్ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ వంటి సినిమాల తర్వాత ప్రభాస్ తో సినిమా ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ షూటింగ్ పనులను పూర్తిచేసుకుని హనురాగవపూడి ఫౌజీ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా దాదాపు 80% షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇక రాజా సాబ్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదల కాగా ఫౌజీ వచ్చే యేడాది ఆగస్టులో విడుదల కాబోతోందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా విడుదలపై ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెలువబడలేదు. ఈ సినిమాలతో పాటు కల్కి, సలార్ సీక్వెల్స్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Priyanka Chopra: SSMB 29 నా జీవితాన్నే మార్చేస్తుంది.. తెగ కష్టపడుతున్న ప్రియాంక చోప్రా!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×