E-Paper
Advertisement

Priyanka Chopra: SSMB 29 నా జీవితాన్నే మార్చేస్తుంది.. తెగ కష్టపడుతున్న ప్రియాంక చోప్రా!

Priyanka Chopra: SSMB 29 నా జీవితాన్నే మార్చేస్తుంది.. తెగ కష్టపడుతున్న ప్రియాంక చోప్రా!
Advertisement

Priyanka Chopra: ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే మొదటిసారి నేరుగా ఒక తెలుగు సినిమాలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రియాంక చోప్రా రాజమౌళి (Rajamouli)మహేష్ బాబు (Mahesh Babu)కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మందాకినిగా ప్రియాంక చోప్రా….

తాజాగా ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మందాకిని పాత్రలో కనిపించబోతున్నారని చిత్ర బృందం వెల్లడించారు. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించి బిగ్ ఈవెంట్ జరగబోతున్న సంగతి తెలిసిందే నవంబర్ 15వ తేదీ గ్లోబ్ ట్రాటర్ పేరిట ఈ సినిమా వేడుక జరుగునుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాకు సంబంధించి గ్లింప్ కూడా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అలాగే చిత్ర బృందం మొత్తం హైదరాబాద్లోనే సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేస్తూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా…

Advertisement

ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా ద్వారా తిరిగి తాను భారతీయ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుందని తెలిపారు. ఇక రాజమౌళితో పనిచేయడం కస్టమా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తనకు కష్టమేమీ కాలేదని అయితే ఈ సినిమా ఖచ్చితంగా నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సినిమా కోసం తాను తెలుగు కూడా నేర్చుకుంటున్నానని తెలుగులో డైలాగ్ చెప్పడం కోసం రాజమౌళి గారు తనకు చాలా సహాయం చేస్తున్నారని కచ్చితంగా తెలుగు మాట్లాడటంలో మీ అందరి అంచనాలను చేరుకుంటాను అంటూ ఈ సినిమా కోసం ఈమె పడుతున్న కష్టాలను కూడా తెలిపారు.

ఇండస్ట్రీ చూపు మొత్తం గ్లోబ్ ట్రాటర్ పైనే…

Advertisement

ఇక ఈ చిట్ చాట్ లో భాగంగా హైదరాబాద్ బిర్యానీ గురించి కూడా ప్రస్తావనకు రావడంతో ప్రపంచంలో బెస్ట్ బిర్యానీ ఎక్కడైనా దొరుకుతుంది అంటే అది హైదరాబాదీ బిర్యాని అంటూ ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం గ్లోబ్ ట్రాటర్ ఈ వెంట పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఎప్పుడు నిర్వహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పైనే ఉందని చెప్పాలి.

Also Read: SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 లో మాధవన్ .. ఒక్క పోస్టుతో లీక్ చేసిన హీరో?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×