E-Paper
Advertisement

WPL 2026 Schedule: WPL 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది..RCBదే తొలి మ్యాచ్‌..కేవ‌లం రెండు వేదిక‌లే, ఉచితంగా ఎలా చూడాలంటే

WPL 2026 Schedule: WPL 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది..RCBదే తొలి మ్యాచ్‌..కేవ‌లం రెండు వేదిక‌లే, ఉచితంగా ఎలా చూడాలంటే

WPL 2026 Schedule:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Women’s Premier League 2026 Tournament ) సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. అందరూ ఊహించినట్లుగానే జనవరి 9వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ టోర్నమెంట్ కంటే ముందే ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటును ఫినిష్ చేయాలన్న ఉద్దేశంతో బీసీసీఐ తాజాగా షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

RCBదే తొలి మ్యాచ్‌..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 ) జనవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Royal Challengers Bangalore vs Mumbai Indians ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఆ రోజున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలు కూడా జరగనున్నాయి. రెండవ మ్యాచ్ యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ మధ్య జనవరి 10వ తేదీన జరగనుంది. అదే రోజున ఈవినింగ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ నిర్వహించనున్నారు. ఐపీఎల్ తరహా లోనే ఆదివారం రోజున రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన ఎలిమినేట‌ర్ మ్యాచ్ నిర్వ‌హించనున్నారు. ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైన‌ల్స్ ఉంటుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం మ్యాచ్ లు అన్నియూ నావీ ముంబై ( Navi Mumbai ) వేదిక‌గా జ‌రుగ‌నున్నాయి. సెకండాఫ్ మ్యాచ్ ల‌న్ని వ‌డోద‌ర వేదిక‌గా జ‌రుగుతాయి. ఎలిమినేట‌ర్‌, ఫైన‌ల్స్ కూడా వ‌డోద‌ర ( Vadodara) వేదిక‌గానే నిర్వ‌హించ‌నున్నారు. అంటే ఓవ‌రాల్ గా ఈ టోర్న‌మెంట్ కోసం రెండు వేదిక‌లను మాత్ర‌మే ఫైన‌ల్ చేశారు.

WPL 2026 టోర్నమెంట్.. ఉచితంగా ఎలా చూడాలంటే ?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ఈ సారి కూడా జియో హాట్ స్టార్ ( Jio Hot Star) లోనే స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్ స్టార్ తో పాటు స్టార్ స్పోర్ట్స్ లో ప్ర‌సారం కానుంది ఈ టోర్న‌మెంట్‌. అయితే, జియో హాట్ స్టార్ ( Jio Hot Star) సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వాళ్లు… ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( WPL 2026) సంబంధించిన మ్యాచ్ లు ఉచితంగా తిల‌కించ‌వ‌చ్చును. మిగ‌తా వాళ్ల‌కు ఆ అవ‌కాశం ఉండ‌దు. ఈ మ్యాచ్ లు ఉచితంగా చూడాలంటే, క‌చ్చితంగా సబ్‌స్క్రిప్షన్ కోసం రీఛార్జ్ చేసుకోవాల్సిందే.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×