E-Paper
Advertisement

వంగీమామ ఇంత త్యాగం చేశారా..? విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

వంగీమామ ఇంత త్యాగం చేశారా..? విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..
Advertisement

Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రోమాంచికం’.. దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ వంగ ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను సమర్పించారు. సెప్టెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘రోమాంచకం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.. ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటుగా టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ముఖ్యఅతిథిగా విచ్చేశారు.. విజయ్ దేవరకొండ రాకతో సినిమాపై అంచనాలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమా గురించి విజయ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాంతో పాటుగా అర్జున్ రెడ్డి కోసం సందీప్ రెడ్డివంగా చేసిన త్యాగాన్ని కూడా బయట పెట్టడంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. అసలు సందీప్ రెడ్డివంగా చేసిన అంత పెద్ద త్యాగం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

వంగ పై విజయ్ షాకింగ్ కామెంట్స్..

విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అర్జున్ రెడ్డి.. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీమా చరిత్రను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత డైరెక్టర్ హీరో బంధం కూడా బలపడింది అని అనేక సందర్భాల్లో విజయ్ దేవరకొండ చెప్పారు.. ఆ సినిమా సమయంలో చేతిలో డబ్బు లేదని చెప్పారు. పేరు కూడా లేదన్నారు. పలుకుబడి లేదని తెలిపారు. ఫ్యాన్ బేస్ కూడా పెద్దగా లేదన్నారు. అయినా ధైర్యంగా ముందుకు వెళ్లామని చెప్పారు.. సినిమా కోసం డైరెక్టర్ ఎంతో పెద్ద త్యాగం చేశారు అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వంగీ మామ నువ్వు గ్రేట్..

Advertisement

అర్జున్ రెడ్డి సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా చేసిన త్యాగాన్ని విజయ్ దేవరకొండ బయటపెట్టారు. ఈ సినిమా కోసం తన పొలాన్ని పూర్తిగా అమ్మేశారు అని విజయ్ చెప్పుకొచ్చారు. సినిమా పూర్తి చేయడానికి పొలం అమ్మాల్సి వచ్చిందని విజయ్ వెల్లడించారు. తనపై, సందీప్‌పై నమ్మకంతో కుటుంబం ఆస్తులను పణంగా పెట్టిందని అన్నారు.. సందీప్‌పై నమ్మకంతో కుటుంబం ఆస్తులను పణంగా పెట్టిందని అన్నారు. కుటుంబ సంపాదనను సినిమాపై పెట్టారని గుర్తుచేశారు.. నా మీద పూర్తి నమ్మకంతో ఈ సినిమా కోసం వాళ్లు చాలా పెద్ద త్యాగం చేశారు. అది నిలబడింది. అప్పటినుంచి నేను ఏ ఫంక్షన్ కి వీళ్ళు పిలిచినా కూడా వెళ్తాను అని విజయ్ చెప్పడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయ్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్అవుతున్నాయి..

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా మారాడు. రౌడీ జనార్దన్ మూవీ తో పాటుగా రష్మిక మందన్నతో కలిసి రణబాలి మూవీలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మధ్యకాలంలో సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ట్రై చేస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎలాంటి రికార్డులను అందిస్తుందో చూడాలి. రష్మిక మందన్న కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. దొరికిపోయిన మౌనిక.. బాలు షాకింగ్ నిర్ణయం..?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

డైరెక్టర్ పై విద్యాబాలన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్న అనుపమ.. అంతలా వేధించారా?

ట్రెడిషనల్ లుక్‌లో మిస్ వరల్డ్ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో!

అసలు ‘ఎంద చేట’ ఎలా పుట్టిందో తెలుసా? కృష్ణారెడ్డి చెప్పిన అసలు కథ!

పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో తప్పు మాదే: సాయి ధరమ్ తేజ్

రవితేజ తల్లిగా దివ్యవాణి.. చివరికి ఏమైందంటే!

ఘరానా మొగుడు ఛాన్స్ మిస్.. అసలు కారణం చెప్పిన దివ్యవాణి!

Big Stories

Advertisement
×