E-Paper
Advertisement

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?
Advertisement

మా బంగారు పుట్ట‌లో వేలు పెడితే కుట్ట‌మా? అన్న‌ట్టుగానే ఉంది బీఆరెస్‌పై కాంగ్రెస్ నేత‌ల కౌంట‌ర్ ఎటాక్‌. మీరు మా ప్ర‌జా పాల‌న‌ను విమ‌ర్శిస్తారా? ప్ర‌శ్నిస్తారా? అయితే కాస్కోండ‌ని ఫామ్‌హౌజ్‌కు పొగ‌ పెట్ట‌డం మొద‌లు పెట్టారు. క‌లుగులోంచి ఎలుక‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించాలంటే పొగ‌బెట్టే ప్ర‌య‌త్నం మొద‌లైంది.

ఇది గెలికి క‌య్యం పెట్టుకున్నట్టుగా త‌యార‌య్యింది ప‌రిస్థితి. మా వెయ్యి రోజ‌ల పాల‌న‌ను త‌ప్పుబ‌డ‌తారా? దీనిపై నిర‌స‌న‌లు కూడా చేస్తారా? అయితే మిమ్మ‌ల్ని ఎక్క‌డ కొట్టాలో అక్క‌డే కొడ‌తాం ఉండుర్రి బిడ్డా..! అన్న‌ట్టుగానే అప్పుడే కాంగ్రెస్ నుంచి కౌంట‌ర్ ఎటాక్ మొద‌ల‌య్యింది. ఏకంగా సీఎం రేవంత్ దీనిపై ఘాటుగా స్పందించిన తీరు కూడా .. బీఆరెస్ ఇచ్చిన పిలుపును కాంగ్రెస్ స‌ర్కార్ అంత‌ ఆషామాషీగా తీసుకోలేద‌ని తెలుస్తోంది.

Advertisement

ముసారాంబాగ్ బ్రిడ్జిని ప్రారంభించిన స‌భ‌లో సీఎం ఈ టాపిక్ మీద దాదాపుగా గంట పాటు బీఆరెస్‌ను ఎడాపెడా క్లాస్ పీకిన వైనం… విమ‌ర్శించిన తీరు.. ఎండ‌గ‌ట్టిన విధానం.. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలియ‌జేసింది. వెయ్యి రోజుల పాల‌న‌పైనే ఇంత‌లా స్పందించిన సీఎం… క‌స్సున లేచిన తీరు.. మున్ముందు త‌న స‌ర్కార్‌ను కాపాడుకునే క్ర‌మంలో ఎంత‌లా ఎటాక్ ఎన్‌కౌంట‌ర్లు చేయ‌గ‌ల‌రో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ట‌య్యింది.

కాంగ్రెస్ యువ‌జ‌న విభాగానికి, ఎన్ఎస్‌యుఐ విద్యార్థి విభాగానికి ఆయ‌న ఆ వేదిక‌గానే పిలుపును కూడా ఇచ్చాడు. ఆరు రోజుల పాటు వ‌రుస‌గా మండ‌ల‌, జిల్లా కేంద్రాల్లో నిర‌స‌న తెల‌పాల‌ని. కేసీఆర్ రాజీనామా చేయాల‌ని. వెయ్యి రోజుల పాటు ప్ర‌భుత్వ జీతం, భ‌త్యాలు, ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా పెడుతున్న ఖ‌ర్చంతా క‌లిపి రూ. 22.24 కోట్లను కేసీఆర్ ఎలాంటి ప‌నిచేయ‌కుండా తీసుకున్నారు. వాడుకున్నార‌నే విమ‌ర్శ‌ల‌ను నెత్తిన పెట్టింది.

Advertisement

దీనికి గాను బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను తెర‌పైకి తెచ్చింది. ఇదో విచిత్ర ప‌రిస్థితి ఇక్క‌డి రాజ‌కీయాల్లో. ఫామ్‌హౌజ్ వీడ‌ని నేత‌.. వ‌స్తావా రావా? అని మొన్న‌టి దాకా వెంట‌ప‌డి వేధించిన స‌ర్కార్‌.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వ్యూహానికి త‌గ్గ‌ట్టుగా త‌న స్టాండ్‌ను మార్చేసుకున్నది. వెయ్యి రోజులైంది ఏవీ మీ హామీలు..? అని నిర‌స‌న తెలిపి.. జ‌నం ముందు దోషిగా నిల‌పాల‌ని భావించిన బీఆరెస్‌ను.. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు పొగ పెట్టే వ్యూహాన్ని సీఎం ఎంచుకోవ‌డం ఆ పార్టీని అవాక్క‌య్యేలా చేసింది.

ఒక‌టి త‌లిస్తే మరోటి ఎదురైంద‌న్న‌ట్టుగా ఇప్పుడు వెన‌క్కి రాలేరు.. ముందుకు పోలేరు.. అన్న‌ట్టుగా త‌యార‌య్యింది బీఆరెస్‌ ప‌రిస్థితి. అందుకే సీఎం రేవంతే అంటున్నాడు.. ఇలాంటి ప‌రిస్థితులు మ‌రెక్క‌డా ఉండ‌వు.. తెలంగాణ రాజ‌కీయాల్లో ఇది కేసీఆర్ స్పెషాలిటీ అంటూ.. ఆయ‌న‌ను ఫామ్‌హౌజ్ నేత‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

బీఆరెస్ ఎంచుకున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు కాంగ్రెస్ నుంచి ఈ విధ‌మైన కౌంట‌ర్ ఎటాక్ రావ‌డం.. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పోటాపోటీ నిర‌స‌న‌లు తెలుపుకోవ‌డం తెలంగాణ రాజ‌కీయాల‌ను మ‌రింత హీటెక్కిస్తున్నాయి.

Tags

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×