Nurse Murder: తెలంగాణలో సంచలనం సృష్టించిన నర్స్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన టూ వీలర్ మెకానిక్ ను పోలీసులు అరెస్టు చేశారు. నర్స్ పై హత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ వెల్లడించారు. కేసును గంటల వ్యవధిలో ఛేందినట్లు ఆయన పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల బాధిత యువతి.. 8 నెలల క్రితం స్నేహితురాలు సారికతో కలిసి హైదరాబాద్ వచ్చింది. ఇద్దరు తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్స్ గా ఉద్యోగంలో చేరారు. హాస్పిటల్ స్టాఫ్ క్వార్టర్స్ లోనే నివాసముంటున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం 2 గంటలకు డ్యూటీకి రావాల్సి ఉండగా బాధిత యువతి రాలేదు. దాంతో సారిక గదికి వెళ్లి ఎన్నిసార్లు తలుపు తట్టినా లోపలి నుంచి సమాధానం రాలేదు. దాంతో సారిక ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బందితో పాటు బాధితురాలి చిన్నమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన నర్స్ చిన్నమ్మ, ఆస్పత్రి సిబ్బందితో కలిసి కిటికీ నుంచి చూడగా ముఖంపై రక్తసిక్తగాయాలతో నర్స్ అచేతనంగా కనిపించింది. దాంతో విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియచేశారు. ఈ క్రమంలో సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా వచ్చారు. ప్రాథమిక విచారణలో బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సనావుల్లా (34)పై అనుమానాలు రావటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ జరుపగా తానే హత్య చేసినట్టుగా సనావుల్లా ఖాన్ అంగీకరించాడు.
నిందితుడు ఉపాధిని వెతుక్కుంటూ 2023లో హైదరాబాద్ వచ్చి.. మెకానిక్ ఆనంద్ గౌడ్ షాపులో బైక్ రిపేర్లు నేర్చుకున్నాడు. రెండు నెలల నుంచి ఆనంద్ గౌడ్ కే చెందిన తుక్కుగూడలో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్ షాపులో పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. కాగా, సనావుల్లా ఖాన్ కు మొబైల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది. దాంతోపాటు ప్రతిరోజూ మద్యం సేవిస్తుంటాడు. తన మెకానిక్ షెడ్డుకు దగ్గరలోనే ప్రైమ్ కేర్ ఆస్పత్రి ఉన్న నేపథ్యంలో అతని కన్ను బాధిత నర్స్ పై పడింది. ఆమెపై కోరిక పెంచుకున్న సనావుల్లా ఖాన్ నర్స్ కదలికలను గమనించాడు. ఈ క్రమంలో ఆమె ఆస్పత్రి క్వార్టర్స్ లోనే ఉంటోందని తెలుసుకున్నాడు.
ఈ క్రమంలో పథకం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత కిటికీ ద్వారా నర్స్ ఉంటున్న గదిలోకి చొరబడ్దాడు. అలికిడికి నిద్ర మేల్కొన్న నర్స్ కేకలు వేయగా ఎడమచేతితో ఆమె నోరు మూసేసి కుడిచేత్తో గొంతు నొక్కి పట్టుకున్నాడు. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో నర్స్ అతని ఎడమచేతి వేలును గట్టిగా కొరకటంతో పాటు ఛాతీపై గోర్లతో రక్కింది. దాంతో కోపంతో రెచ్చిపోయిన సనావుల్లా ఖాన్ ఆమెపై బరువైన వస్తువుతో విచక్షణారహితంగా కొట్టాడు. గొంతు నులిమి చంపేశాడు.
Also Read: చెత్తలో పడేసే ప్లాస్టిక్ బాటిళ్లతో.. అద్భుతమైన ఇల్లు.. కెనడా బిల్డర్ల క్రేజీ ఆవిష్కరణ!
ఆ తర్వాత అత్యంత పాశవికంగా ఆమెపై అఘాయిత్యం జరిపాడు. అనంతరం కిటికీని యథాస్థానంలో పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుని నుంచి ఓ మొబైల్ ఫోన్ తో పాటు నేరం చేసినపుడు వేసుకున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. గంటల్లోనే కేసులోని మిస్టరీని ఛేదించి నిందితున్ని అరెస్ట్ చేసిన సిబ్బందిని డీసీపీ రాజేశ్ అభినందించారు.
Also Read: వెలిగొండపై రేవంత్ సైలెంట్.. తెలంగాణకు తీరని ద్రోహం.. హరీశ్ రావు ధ్వజం!