E-Paper
Advertisement

Sankranti 2026 Movies: సంక్రాంతి హడావిడి మొత్తం ఒకే ఒక్క రోజులో ఉందిగా..

Sankranti 2026 Movies: సంక్రాంతి హడావిడి మొత్తం ఒకే ఒక్క రోజులో ఉందిగా..
Advertisement

Sankranti 2026 Telugu Movies: తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా సినీ ప్రేమికులకు సంక్రాంతి అంటే ఒక పెద్ద సినిమా పండగ. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో థియేటర్ల ముందు ఫ్యాన్స్ సందడి, పెద్ద హీరోల సినిమాలు, భారీ ఓపెనింగ్స్ కామన్. ఈసారి సంక్రాంతి 2026 కూడా అదే రేంజ్‌లో ఉండబోతోంది. ఈసారి ఏకంగా ప్రభాస్, చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి.

ముందుగా అందరి చూపు ఉంది ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న ‘ది రాజా సాబ్’ మీద. హారర్ కామెడీ, ఫాంటసీ టచ్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 9, 2026న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ కొత్త లుక్, మారుతి మార్క్ కామెడీ కలిసి సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అదే రోజున తలపతి విజయ్ నటించిన తమిళ సినిమా ‘జన నాయకుడు’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతోంది. విజయ్‌కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్‌బేస్ ఉండటంతో ఈ సినిమా కూడా థియేటర్ల దగ్గర బజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

సంక్రాంతి బరిలో భారీ సినిమాలు..

Advertisement

సంక్రాంతి రేస్‌లో మరో భారీ సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌లో పండగ వాతావరణం. అందులోనూ వెంకటేష్ క్యామియో కూడా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా జనవరి 12, 2026న రిలీజ్ కానుంది. చిరంజీవిని మళ్లీ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌లో చూడబోతున్నామన్న ఆనందంలో ఫ్యాన్స్‌ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

 

ఒక్కరోజు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాల్సిందే..

Advertisement

రవితేజ అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమాతో మాస్ మహారాజా గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జనవరి 13, 2026న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ జనవరి 7న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా జనవరి 7న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది.

చివరగా శర్వానంద్ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ జనవరి 15, 2026న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కూడా మంచి బజ్ ఉంది. అయితే మిగతా సినిమాల్లా జనవరి 7న పెద్ద ఈవెంట్స్ మాత్రం ప్లాన్ చేయలేదని సమాచారం.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జనవరి 7, 2026. ఆ రోజు ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, సెలబ్రిటీల స్పీచెస్‌తో సినిమా ప్రేమికులకు పండగ రోజు లాంటి వాతావరణం ఉండబోతోంది. చిరంజీవి వెంకటేష్ కలిసి పాల్గొనే ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుండటం ఇంకా పెద్ద హైలైట్. మొత్తానికి సంక్రాంతి 2026 బాక్సాఫీస్ హడావిడి మొత్తం జనవరి 7 న కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ALSO READ: Prabhas రోజూ.. కేవలం దాని కోసమే రూ.2 లక్షలు ఖర్చు పెడతాడట!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×