E-Paper
Advertisement

Sridhar Babu: హైదరాబాద్‌ను మరో ఢిల్లీ కానివ్వం.. హిల్ట్ పాలసీపై మంత్రి శ్రీధర్ బాబు ధీమా

Sridhar Babu: హైదరాబాద్‌ను మరో ఢిల్లీ కానివ్వం..  హిల్ట్ పాలసీపై మంత్రి శ్రీధర్ బాబు ధీమా
Advertisement

Sridhar Babu: రాష్ట్ర అభివృద్ధి, రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకువస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఈ పాలసీపై కొందరు అనవసర విమర్శలు చేస్తన్నారని చురకలంటించారు. హైదరాబాద్‌ మహానగరాన్ని ఒక ప్రణాళికాబద్ధమైన రీతిలో అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ఇందులో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో పరిశ్రమలు ఒకచోట, నివాస ప్రాంతాలు మరొకచోట ఉండేవని.. కానీ మారుతున్న కాలంతో పాటు పారిశ్రామిక ప్రాంతాలు ప్రస్తుతం నివాస ప్రాంతాలుగా మారిపోయాయని చెప్పారు. జనావాసాలు, పరిశ్రమలు కలిసిపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య ఇబ్బందులను తొలగించడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

హిల్ట్ పాలసీ బయటకు రాకముందే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. భూములు అమ్ముతున్నారంటూ అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న భూములు.. ఆయా కంపెనీల సొంత భూములని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కొని కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.

Advertisement

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. హిల్ట్ పాలసీపై కూడబలుక్కొనే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హాయంలోనే పరిశ్రమల తరలింపుపై..లీజ్ ల్యాండ్‌ ఫ్రీ హోల్డ్ చేయడంపై.. కేబినెట్ సబ్‌ కమిటీ వేసిందని గుర్తు చేశారు. అనాడు వంద శాతం పూర్తిగా పరిశ్రమలకు భూములు కేటాయిస్తే..బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

హైదరాబాద్‌లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. నీటిలో విషపూరితమైన లోహాలు ఎక్కువగా ఉన్నాయని..పారిశ్రామిక రసాయన వ్యర్థాలు నేరుగా భూమిలోకి చేరడమే ఈ దుస్థితికి కారణమని తెలిపారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని హెచ్చరించారు. ఢిల్లీ తరహా కాలుష్యం హైదరాబాద్‌కు పొంచి ఉందన్నారు. నగరంలో వాయు కాలుష్యం కూడా కలవరపెడుతోందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 180 పాయింట్లు నమోదవుతోందని..  మనం ఇప్పటికైనా మేల్కొకపోతే హైదరాబాద్ కూడా మరో ఢిల్లీలా మారడం ఖాయమని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ: Amaravati: వేగం పెంచిన కూటమి సర్కార్.. అడ్డంకులు తొలగిస్తూ ‘అమరావతి’ పరుగులు

Related News

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

Big Stories

Advertisement
×