E-Paper
Advertisement

YouTube Shorts AI: యుట్యూబ్ షార్ట్స్‌లో ఏఐ ధమాకా.. ఒక్క ఫ్రేమ్‌తోనే 8 సెకన్ల వీడియో రెడీ.. కొత్త ఫీచర్ ఎలా ఉపయోగించాలంటే

YouTube Shorts AI: యుట్యూబ్ షార్ట్స్‌లో ఏఐ ధమాకా.. ఒక్క ఫ్రేమ్‌తోనే 8 సెకన్ల వీడియో రెడీ.. కొత్త ఫీచర్ ఎలా ఉపయోగించాలంటే
Advertisement

YouTube Shorts AI| యూట్యూబ్ తన షార్ట్స్ క్రియేటర్ల కోసం ఒక కొత్త ఏఐ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ కొత్త టూల్ పేరు “రీఇమాజిన్.” ఈ ఫీచర్ సహాయంతో, క్రియేటర్లు ఒక్క వీడియో ఫ్రేమ్ నుంచి కొత్త క్లిపింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఏఐ ద్వారా రూపొందించిన వీడియో 8 సెకన్ల వరకు ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల కంటెంట్ క్రియేషన్ చాలా వేగంగా మారుతుంది. సాధారణ దృశ్యాలను కూడా క్షణాల్లో ఆకట్టుకునే వీడియోలుగా మార్చేయొచ్చు.

ఏఐ ఎలా పనిచేస్తుంది?

ఈ ఫీచర్ వెనుక ఉన్న అసలు బలం అడ్వాన్స్ ఏఐ టెక్నాలజీనే. యూట్యూబ్ దీని కోసం తన సొంత వియో మోడల్‌ని ఉపయోగిస్తుంది. ఈ మోడల్ వీడియో దృశ్యాలతో పాటు, సరిపోయే ఆడియోను కూడా సొంతంగా తయారు చేస్తుంది. దీనివల్ల క్రియేటర్లకు ఎడిటింగ్ నైపుణ్యాలు అవసరం లేదు. అలాగే, గూగుల్ జెమినీ ఏఐ కూడా ఈ ఫీచర్‌కు మద్దతునిస్తుంది. అంతే కాదు క్రియేటర్లకు కొత్త కొత్త క్రియేటివ్ ఆలోచనలు, మెరుగుదలల కోసం సలహాలు ఇస్తుంది. క్రియేటర్లు ఈ సలహాలను అనుసరించవచ్చు లేదా వారి సొంత ఆలోచనలతో సృష్టించుకోవచ్చు.

రీఇమాజిన్ టూల్ ఎలా ఉపయోగించాలి?

Advertisement

ఈ రీఇమాజిన్ టూల్ చాలా సులభంగా ఉంటుంది. ఎవరికైనా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా వినియోగించుకోవచ్చు. ముందుగా, ఏదైనా షార్ట్స్ వీడియో నుంచి ఒక ఫ్రేమ్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత, వివిధ క్రియేటివ్ ఆప్షన్ల ద్వారా ఆ ఫ్రేమ్‌ని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎంచుకున్న ఫ్రేమ్‌లో కొత్త వస్తువులను జోడించొచ్చు లేదా ఏఐ సిస్టమ్‌కు సూచనలు చేయవచ్చు. ఈ ఇన్‌పుట్‌ల ఆధారంగా టూల్ ఒక కొత్త వీడియోను తయారు చేస్తుంది. దానికి తగిన ఆడియోను కూడా సొంతంగా జోడించేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కేవలం కొన్ని సెకన్లలో పూర్తవుతుంది.

క్రియేటర్లకు లాభాలు ఏమిటి?

ఈ ఫీచర్ క్రియేటర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా బిగినర్స్ ఇప్పుడు ఎలాంటి ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ లేకుండానే ప్రొఫెషనల్ లుక్ ఉన్న వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఇది సమయాన్ని, కృషిని ఆదా చేస్తుంది. అంతేకాకుండా, క్రియేటర్లు కొత్త ఐడియాలతో ప్రయోగాలు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం.

అసలు క్రియేటర్లకు క్రెడిట్

Advertisement

యూట్యూబ్ అసలు కంటెంట్ క్రియేటర్లకు న్యాయం చేసేలా ఈ ఫీచర్‌ని రూపొందించింది. రీఇమాజిన్ ద్వారా తయారైన ప్రతి వీడియోలో అసలు వీడియోకు లింక్ స్వయంగా జోడించబడుతుంది. దీనివల్ల రియల్ క్రియేటర్‌కు ఎక్కువ సంఖ్యలో వ్యూస్, మరింత మంది ప్రేక్షకులు దొరుకుతారు. ఇలా కొత్తవారికి, పాత క్రియేటర్లకు ఇది ఒక మంచి వేదికగా నిలుస్తుంది.

కంటెంట్ క్రియేషన్‌లో కొత్త యుగం

ఈ ఫీచర్ ప్రజలు వీడియోలను సృష్టించే విధానాన్ని మార్చేస్తుంది. ఇది కొత్త క్రియేటర్లకు అడ్డంకులను తగ్గిస్తుంది. ఇకపై ఎవరైనా సులభంగా అధిక క్వాలిటీ గల కంటెంట్‌ని తయారు చేసుకోవచ్చు. ఇలాంటి టూల్స్ వల్ల భవిష్యత్తులో క్రియేటర్లు టెక్నికల్ స్కిల్స్ కంటే వారి ఆలోచనలు, క్రియేటివిటీపై ఎక్కువ దృష్టి పెట్టగలరు.

Also Read: ప్రతి నెలా రూ.2.7 లక్షల ఆదాయం.. ఫేస్‌బుక్ యూజర్లకు మెటా బంపర్ ఆఫర్

యూట్యూబ్ రీఇమాజిన్ ఫీచర్ షార్ట్స్ క్రియేషన్స్‌లో కొత్త సౌలభ్యం జోడించింది. ఇది ఏఐ పవర్‌ని యూజర్ క్రియేటివిటీతో చక్కగా కలుపుతుంది. ఈ ఫీచర్ ఫ్లాట్‌ఫాంపై క్రియేటివిటీ, ఎంగేజ్‌మెంట్ పెంచుతుంది. వీడియో క్రియేటివిటీ అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×