E-Paper
Advertisement

స్టార్ హీరోలు తమ కూతుర్లను ఇండస్ట్రీకి అందుకే పంపరా? షాకింగ్ విషయాలు చెప్పిన జేడీ!

స్టార్ హీరోలు తమ కూతుర్లను ఇండస్ట్రీకి అందుకే పంపరా? షాకింగ్ విషయాలు చెప్పిన జేడీ!
Advertisement

J.D.Chakravarthy: జె.డి.చక్రవర్తి పరిచయమవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారు అయితే ప్రస్తుతం జె డి చక్రవర్తి పలు వెబ్ సిరీస్ లలోను అలాగే సినిమాలలో కూడా నటిస్తూ ఇప్పుడిప్పుడే కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇదిలా ఉందిగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జెడి చక్రవర్తి ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యల గురించి అలాగే స్టార్ హీరోల కూతుర్ల గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో చాలా అన్యాయం జరుగుతుంది..

జె.డి చక్రవర్తి ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియపరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి కానీ అవి మాత్రం బయటకు రావడం లేదని తెలిపారు. ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ అన్యాయాలు గురించి తెలిసిన వారు కూడా భయం కారణంగా వాటిని బయట పెట్టడం లేదని చక్రవర్తి తెలిపారు.

పక్క రాష్ట్రాల వారికే అవకాశాలు..

Advertisement

ఇలా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల కారణంగానే అగ్ర హీరోలు అందరూ కూడా వారి కూతుర్లను ఇండస్ట్రీకి పంపడానికి వెనకడుగు వేస్తున్నారని జెడి చక్రవర్తి చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి. ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ఆడపిల్లల పట్ల ఉండే ధోరణి కారణంగానే స్టార్ హీరోల పిల్లలు ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా రావడం లేదని తెలిపారు. ఎంతోమంది తెలుగు అమ్మాయిలకు మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కొన్ని నిబంధనలు కారణంగా అవకాశాలు కోల్పోతున్నారని తద్వారా పక్క రాష్ట్రాల వారికి అవకాశాలు వస్తున్నాయని తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల స్టార్ డాటర్స్ హీరోయిన్లుగా కాకుండా నిర్మాతలుగా ఇతర రంగాలలో స్థిరపడుతున్న సంగతి తెలిసిందే.

క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉన్నాయా?

Advertisement

జెడి చక్రవర్తి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇండస్ట్రీలో మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అందుకే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ , కృష్ణ అలాంటి స్టార్ హీరోలు అందరూ కూడా తమ పిల్లలను ఇండస్ట్రీలోకి అందుకే పంపించలేదా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే జెడి చక్రవర్తి అలాంటి కామెంట్స్ చేసి ఉంటారని తెలుస్తోంది.

Also Read: తల్లి కాబోతున్న కుంభమేళా మోనాలిసా.. పెళ్లయిన నెలకే? ఇదేం ట్విస్ట్ అయ్యా!

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×