Priyanka Chopra Post: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ రాజమౌళి. నవంబర్ 14న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించాడు జక్కన్న. ఓ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఈవెంట్ ని కూడా కూడా గ్లోబల్ రేంజ్ ప్లాన్ చేయొచ్చని చూపించాడు రాజమౌళి. చూడటానికి ఇది టైటిల్ లాంచ్ లా లేదు ఏ అవార్డు ఫంక్షనో అన్నట్టుగా అనిపించింది. కేవలం టైటిల్ లాంచ్ నే ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తే నెక్ట్స్ సినిమా అప్డేట్స్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏ స్థాయిలో ఉంటాయో మీ ఊహాకే అందాలి.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా ఫీట్ కొట్టిన జక్కన్న వారణాసితో గ్లోబల్ అటెన్షన్ గెయిన్ చేయబోతున్నాడు. ఇప్పటికే వారణాసి గురించి గ్లోబల్ స్థాయిలో చర్చించుకుంటున్నారు. నేటి ట్రెండ్ తగ్గట్టు సినిమా చేస్తూనే ఇతీహాసాలను మూలంగా తీసుకున్నాడు. రామాయాణంలో ని ఓ భాగాన్ని జక్కన్న ఆధునిక కాలంలో తీసుకువచ్చి.. వెండితెరపై ఆవిష్కరించేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం ఫాంటసీ అంశాలతో పాటు హిందూ సనాతన ధర్మం, ఇతిహాసం రామయణంలోని కీలక ఘట్టాన్ని తీసుకుని దానికి ప్రపంచ వినాశకర అంశాన్ని జోడించి ‘వారణాసి’ని తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతికథానాయకుడిగా నటిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన వీరి ఫస్ట్ లుక్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. చీరలో ట్రెండీ మందాకినిగా గన్ తో అదరగొట్టింది ప్రియాంక. ఇక పృథ్వీరాజ్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోబో చైర్ తో యుద్దంలో దిగి రణరంగం సృష్టించినట్టు కనిపించాడు కుంభ. కేవలం ఫస్ట్ లుక్ తోనే ఓ రేంజ్ బజ్ పెంచారు. ఇక మహేష్ రుద్ర లుక్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం రుద్ర లుక్, వారణాసి గురించే చర్చించుకుంటుంది. విడివిడిగా అంతగా బజ్ క్రియేట్ చేసిన కుంభ, మందాకిని, రుద్రలు ఒకే ఫ్రేంలో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఆ పిక్ టాక్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు కదా. ఈ ముగ్గురు బ్లాక్ అండ్ బ్లాక్ సెల్పీలకు ఫోజులు ఇచ్చారు.
ఈ ఫోటోలను మందాకిని (ప్రియాంక చోప్రా) సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలు షేర్ చేస్తూ వారణాసి గురించి ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది ప్రియాంక. తెలుగు, మాలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు దిగ్గజాలలతో కలిసి పని చేయడం.. మరి ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సినిమాలో భాగం అవ్వడం ఇప్పటికే దక్కిన ఒక గొప్ప గౌరవం. మూవీ రిలీజ్‌కు ఏడాది ముందే ఇంటర్నేషనల్ మీడియా ముందు సినిమాను ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ల రియాక్షన్స్, పెరుగుతున్న అంచనాలు చూస్తుంటే చాలా ఉ్సాహంగా ఉంది. దేవుని దయతో మీ అంచనాలను చేరుకుంటామని ఆశిస్తున్నా. జై శ్రీరామ్’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక పోస్ట్ సోషల్ మీడియా, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రుద్ర, మందాకిని, కుంభల సెల్పీ లుక్ అయితే సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. సోషల్ మీడియాలో మొత్తం ఈ ఫోటో గురించి మాట్లాడుకుంటున్నాయి.
Also Read: Aishwrya Sharma: భర్తతో విడాకులు… కర్మ వదిలిపెట్టదు.. నటి ఐశ్వర్య రియాక్షన్