E-Paper
Advertisement

Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి.., ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి..,  ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

1. అదుపులోకి మావోయిస్టులు

ఎన్టీఆర్ జిల్లా పెనమలూరును కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. విజయవాడ చుట్టుపక్కల 25 మంది మావోయిస్టు సానుభూతిపరులున్నట్లు సమాచారం అందడంతో… ఆక్టోపస్ బృందాలు ఇంటింటిని తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టులు పెనమలూరలోని కొత్త ఆటోనగర్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టి.. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

2. మావోయిస్టు అగ్ర నేత హతం

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారన్నారు ఏపీ ఇంటెలిజెన్స్ ఛీప్ మహేశ్ చంద్ర. హిడ్మాపై కోటి రివార్డు… హిడ్మా భార్యపై 50లక్షల రివార్డు ఉందన్నారు. దక్షిణ బస్తర్ లోని దండకారణ్యంలో తిరుగులేని పట్టున్న మావోయిస్టు హిడ్మా అన్నారు. చత్తీస్‌గఢ్‌లో కగార్ ఆపరేషన్ తీవ్రతరం కావడంతో ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తలదాచుకుంటున్నారని తెలిపారు మహేశ్ చంద్ర.

3. పుట్టపర్తికి వెంకయ్యనాయుడు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి పుట్టపర్తికి విచ్చేశారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవితమ్మ, సత్య కుమార్ యాదవ్, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత ఘనంగా వెంకయ్య నాయుడికి స్వాగతం పలికారు.

4. చైన్ స్నాచింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. బరంపేటలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ చేశారు దుండగులు. బైక్‌పై వచ్చి బంగారు గొలుసు లాక్కొని ఇద్దరు దొంగలు పరార్ అయ్యారు. చైన్ స్నాచర్లని అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళ అభినయపై విచక్షణ రహితంగ దాడి చేశారు దొంగలు.

5. తిరుమలలో వర్షం

తిరుమలలో భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. చల్లగా ఉండే తిరుమలలో వరుణుడి రాకతో చలి తీవ్రత పెరిగింది. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురి అయిన ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు.

6. బద్ది పోచమ్మ ఆలయంలో అడ్డగోలుగా వసూళ్లు

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన బద్ది పోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీని ఆసరాగా తీసుకుని సిబ్బంది అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూన్నారనే ఆరోపణలు వచ్చాయి. సూపరింటెండెంట్ అండదండలతోనే ఇది జరుగుతుందని, వీడియో వైరల్ అయినా ఈవో పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

7. ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మల్లెల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును కారు క్రాస్ చేస్తుండగా పొలం నుంచి వచ్చిన ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. వెంటనే వెనుక వస్తున్న మరో కారు కూడా ఢీకొట్టింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

8. ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి..

కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామాంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శిరిగినీడి దుర్గాప్రసాద్, ఇద్దరు పిల్లలతో కలిసి ఆధార్ అప్‌డేట్ పేరుతో వెళ్లి దిండి వశిష్ఠ గోదావరి బ్రిడ్జిపై దూకాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో నదిలో దూకి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

9. విద్యార్థులతో మట్టి పని

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరలపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో సిబ్బంది మట్టి పని చేయించడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై స్పందించిన డీఈవో చంద్రకళ, ఇన్‌ఛార్జ్ హెడ్ మాస్టర్ రాజు నాయక్, పీడీ అశోక్ కుమారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విచారణలో నిర్లక్ష్యం రుజువైతే చర్యలు తప్పవని తెలిపారు.

10. విలాస్ బ్రిడ్జి వివాదం

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్. భారవి మాట్లాడుతూ… అధికారులు కోర్టు స్టేటస్ కోను ఉల్లంఘించి 80 అడుగుల్లోనే నిర్మాణం చేపట్టారన్నారు. 120 అడుగుల ప్రాజెక్టు, సర్వీస్ రోడ్లు, నష్టపరిహారం కోసమే కోర్టును ఆశ్రయించామని, బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

11. ప్రేమ వివాహం.. సంవత్సరానికే యువతి సూసైడ్

ఎల్బీనగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్న సంవత్సరానికే గంగోత్రి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. భర్త బాను (లారీ డ్రైవర్),రూ.30 లక్షల కట్నం కోసం వేధించాడని ఆమె సూసైడ్ లెటర్‌లో రాసింది. “వాడిని కూడా చంపేయాలి” అంటూ కూలి పని చేసి పెంచిన అంటూ గంగోత్రి తండ్రి సైదులు ఆవేదన వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న బాను కోసం పోలీసులు గాలిస్తున్నారు.

12. తెలంగాణ రైజింగ్ విడుదల

సింగపూర్, టోక్యో లాంటి దేశాలతోనే తెలంగాణకు పోటీ తప్ప పక్క రాష్ట్రాలతో కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో రాజధాని అయ్యేందుకు కావాల్సిన అర్హతలు అన్నీ హైదరాబాద్‌కు ఉన్నాయన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయబోతున్నామని.. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్స్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

13. యథావిధిగా పత్తి కొనుగోళ్లు

జిన్నింగ్ మిల్లర్లు, CCI సీఎండీతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు సఫలం అయ్యాయి. జిన్నింగ్ మిల్లర్లు, పత్తి రైతులు సమస్యలపై మిల్లర్ల యజమానులు, CCI సీఎండీతో మంత్రి భేటీ అయ్యారు. CCI నిబంధనలు సడలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో రేపటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు కొనసానున్నాయి.

14. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్.. మంత్రి వివేక్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై హాట్‌ కామెంట్స్‌ చేశారు మంత్రి వివేక్‌ వెంకటస్వామి. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాల తర్వాత కేటీఆర్‌ ఫెయిల్యూర్‌ లీడర్‌ అని మరోసారి రుజువైందని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికలో తానే సీఎం అని కేటీఆర్‌ ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలుపై కేటీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు మంత్రి.

15. ఢిల్లీ పేలుడు.. దర్యాప్తు స్పీడ్

ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తును స్పీడ్‌ పెంచింది ఎన్‌ఐఏ. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక నిందితుడు జసీర్‌ బిలాల్‌ వానిని అరెస్ట్‌ చేశారు ఎన్‌ఐఏ అధికారులు.

16. ఓటమి పై పీకే స్పందన

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ ఘోర ఓటమిపై ఆ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ స్పందించారు. గెలుపు కోసం నిజాయితీగా కృషి చేసినా విఫలమయ్యానని, దీనికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటమి సెట్‌బ్యాక్ అయినా, వెనుకడుగు వేయకుండా పొరపాట్లను సవరించుకొని మళ్లీ పునర్నిర్మిస్తామని చెప్పారు పీకే.

17. ఎలాంటి ఆధారాలు లేవు

విఫలమైన ప్రతి బంధాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9 ఏళ్లు లైంగిక సంబంధంలో ఉన్న దేవా విజయ్‌పై ఓ యువతి పెట్టిన రేప్ కేసును కోర్టు కొట్టివేసింది. యువకుడిపై మోసం చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని విచారణలో పేర్కొంది.

18. స్పందించిన లూలూ

బిహార్‌లో ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంలో ఏర్పడ్డ చీలికలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వీటిపై లాలూ తొలిసారి స్పందించారు. ఇది తమ కుటుంబంలోని అంతర్గత విషయమని.. దీన్ని పరిష్కరించుకుంటామని వ్యాఖ్యానించారు.

19. దూసుకెళ్తున్న డ్యూడ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ డ్యూడ్ ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్‌లో 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఈనెల 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన తొలి వారంలోనే మిలియన్ వ్యూస్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు.

20. మాజీ స్పిన్నర్ ఫైర్

భారత్‌లో టెస్టు క్రికెట్ నాశనమైందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. బౌలర్లకు అత్యధిక సహకారం ఇచ్చే ఈడెన్ గార్డెన్స్ వంటి పిచ్‌లు క్రికెటర్ల అభివృద్ధిని అడ్డుకుంటాయన్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో 124 పరుగుల లక్ష్యం ఛేదించలేక ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పేలవ పిచ్‌లతో జట్టు గెలిచినా క్రికెటర్లు ఎదగరని విమర్శించారు.

 

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×