E-Paper
Advertisement

Andre Russell Retirement: ఐపీఎల్ కు ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్..మ‌రో ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో ఎంట్రీ

Andre Russell Retirement: ఐపీఎల్ కు ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్..మ‌రో ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో ఎంట్రీ

Andre Russell Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) కంటే ముందు మరో ఊహించని పరిణామం ఎదురైంది. కేకేఆర్ డేంజర్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తాజాగా ప్రకటన చేశాడు. మొన్న రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఆండ్రీ రస్సెల్ ను వదిలేసింది కేకేఆర్ జట్టు యాజమాన్యం. దీంతో డీలా పడిపోయిన ఆండ్రీ రస్సెల్ ( Andre Russell Retirement), వేలంలోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ, ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు పూర్తిగా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు. ఇక వచ్చే సీజన్ లో కేకేఆర్ పవర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడట ఆండ్రీ రస్సెల్. ఈ మేర‌కు న్యూస్ వైర‌ల్ గా మారింది.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

ఐపీఎల్ కు ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో కొత్త ఫ్రాంచైజీలో ఆడ‌తాడ‌నుకున్న ఆండ్రీ రస్సెల్, సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మొన్న జ‌రిగిన రిటేన్ష‌న్ ప్ర‌క్రియ‌లో ఆండ్రీ రస్సెల్ ను తీసుకోకుండా, వ‌దిలేసింది. దీంతో మెగా వేలంలోకి ఆండ్రీ రస్సెల్ వ‌స్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. దీంతో ఆండ్రీ రస్సెల్ ను కొనుగోలు చేసేందుకు, చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఆర్సీబీ ప్లాన్ చేసాయి. కానీ, మినీ వేలం రాక‌ముందే, ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు ఆండ్రీ రస్సెల్‌. కేకేఆర్ జ‌ట్టుకు త‌ప్ప‌, ఏ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌బోన‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌.

కేకేఈఆర్ జ‌ట్టు త‌ర‌ఫున 2014 నుంచి ఆండ్రీ రస్సెల్ ఆడాడు. అంటే దాదాపు 11 ఏళ్ల పాటు కేకేఆర్ త‌ర‌ఫున ఆడి, చాలా విజ‌యాలు అందించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్ అన్ని విభాగాల్లో అద‌ర‌గొట్టాడు. ఐపీఎల్ లో ది బెస్ట్ ఆల్ రౌండ‌ర్ గా ఆండ్రీ రస్సెల్ ర‌ఫాడించాడు. ఇక ఇప్పుడు కేకేఆర్ అత‌న్ని వ‌దిలేయ‌డంతో, ఇప్పుడు రిటైర్మెంట్ ఇస్తూ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు. అయితే, ఇక‌పై కేకేఈఆర్ బ్యాటింగ్ కోచ్ గా ఆండ్రీ రస్సెల్ కు అవ‌కాశం ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఐపీఎల్ లో ఆండ్రీ రస్సెల్ రికార్డులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో దాదాపు 11 సంవత్సరాల పాటు కేకేఆర్ జట్టు తరఫున ఆడాడు ఆండ్రీ రస్సెల్. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ లో మొత్తం 140 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 2651 పరుగులు సాధించాడు. అలాగే 123 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇది ఇలా ఉండగా డూప్లిసెస్ నిన్న ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Andre Russell Retirement

 

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×