E-Paper
Advertisement

Allu Arjun AA22: అల్లు అర్జున్ కోసం షారుఖ్ ఖాన్.. అట్లీ మాస్టర్ ప్లాన్..ఐకాన్ స్టార్ అభిమానులకు పండగే..!

Allu Arjun AA22: అల్లు అర్జున్ కోసం షారుఖ్ ఖాన్.. అట్లీ మాస్టర్ ప్లాన్..ఐకాన్ స్టార్ అభిమానులకు పండగే..!
Advertisement

Allu Arjun AA22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ రాబోతోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా AA22 గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

అల్లు అర్జున్ సినిమా కోసం షారుక్..!

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 7 రాత్రి 11:59 గంటలకు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని షారుఖ్ ఖాన్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అట్లీ గతంలో షారుక్ తో జవాన్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ ట్రైలర్ ని ఈ హీరో ద్వారా విడుదల చేయబోతున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్, హీరోయిన్ దీపికా పడుకొనే, అలాగే దర్శకుడు అట్లీ కూడా వర్చువల్‌గా పాల్గొననున్నారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఈ ప్రకటనకు మరింత హైప్ ఏర్పడింది.

Advertisement

AA22 సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆయన తీసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో ఇప్పటివరకు తీస్తున్న అత్యంత ఖరీదైన సినిమాగా చెబుతున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8, 2025న ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ఈ సినిమా ఎలా రూపొందిస్తున్నారో చిన్న గ్లింప్స్ కూడా చూపించారు. ఆ వీడియో చూసిన తర్వాతే అభిమానుల్లో ఈ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.

ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ విడుదల గురించి వస్తున్న వార్తలు అభిమానులను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా ఈ గ్లింప్స్ విడుదల అవుతుందని రావడం చాలా మందికి సర్ప్రైజ్‌గా మారింది. ఇది నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు నిజంగానే పండగే అని చెప్పాలి.

ప్రస్తుతం AA22 సినిమా భారతదేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్‌గా మారింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, అట్లీ దర్శకత్వం..ఈ మూడు కలిసి ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. టైటిల్ గ్లింప్స్ విడుదల తర్వాత ఈ సినిమా పై మరింత చర్చ జరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: Demon Pawan Father: డెమోన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో తండ్రి మరణం..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×