E-Paper
Advertisement

Demon Pawan Father: డెమోన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో తండ్రి మరణం..

Demon Pawan Father: డెమోన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో తండ్రి మరణం..
Advertisement

Demon Pawan Father: ఇటీవల బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ 9 తెలుగు(Bigg Boss 9telugu) రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేసిన వారిలో డెమోన్ పవన్(Demon Pawan) ఒకరు. ఈ కార్యక్రమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ ఇంట్లో తాజాగా తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న డెమోన్ పవన్ తండ్రి ఉప్పల దుర్గాప్రసాద్ (Durga Prasad)నేడు కన్నుమూశారు. ఈ విషయాన్ని పవన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు దీంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. డెమోన్ పవన్ తండ్రి గత కొంతకాలంగా టంగ్ క్యాన్సర్ (Tongue Cancer)తో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

క్యాన్సర్ తో డెమోన్ పవన్ తండ్రి మృతి..

ఈ విషయాన్ని స్వయంగా పవన్ తెలియజేశారు. అలాగే తన తండ్రి ట్రీట్మెంట్ కోసం ఈయన టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉన్న సమయంలోనే ప్రైజ్ మనీ తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా తన తండ్రికి క్యాన్సర్ అనే విషయం తాను బిగ్ బాస్ హౌస్ వెళ్లడానికి ముందే తెలిసిందని అప్పటికే తన తండ్రికి సర్జరీ కూడా చేయించామని పవన్ తెలియజేశారు. ఇలా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నేడు(మార్చి 10వ తేదీ) కన్నుమూసారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈయన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మీ జ్ఞాపకాలు మదిలో మెదులుతూనే ఉంటాయి..

Advertisement

తన తండ్రి ఫోటోని షేర్ చేస్తూ పవన్.. మంచితనానికి మారుపేరుగా నిలిచి ప్రేమ ఆప్యాయతలను పంచిన మీ జ్ఞాపకాలు, మధురస్మృతులు ఎల్లప్పుడూ మా మదిలో మెదులుతూనే ఉంటాయి మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు నేటిజన్ లు సోషల్ మీడియా వేదికగా డెమోన్ పవన్ కు ధైర్యం చెబుతూ తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవల డెమోన్ పవన్ పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

డెమోన్ పవన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్..

Advertisement

ఇలా తన కొడుకు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ఈయన ఉన్నఫలంగా మరణించడంతో పవన్ అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ విషయానికి వస్తే కామన్ మ్యాన్ క్యాటగిరి లో భాగంగా ఈయన బిగ్ బాస్ అగ్ని పరీక్షలో గట్టి పోటీ ఇస్తూ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ 3 కంటెస్టెంట్ గా ఉన్న పవన్ బుల్లితెరపై ప్రసారమవుతున్న బీబీ జోడి కార్యక్రమంలో సందడి చేశారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్న పవన్ ఇంట్లో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకోవడంతో గమనార్హం.

Also Read: Allu Arjun: మరోసారి మంచి మనసు చాటుకున్న ఐకాన్ స్టార్.. కాకినాడ జిల్లా వాసికి ఆర్థిక భరోసా?

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×