E-Paper
Advertisement

Vande Bharat Sleeper: హైదరాబాద్- ఢిల్లీ రూట్ లో వందే భారత్ స్లీపర్, రైల్వే కీలక ప్రకటన!

Vande Bharat Sleeper: హైదరాబాద్- ఢిల్లీ రూట్ లో వందే భారత్ స్లీపర్, రైల్వే కీలక ప్రకటన!

దేశ వ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే ప్రయాత్నాలు చేస్తోంది. ఇప్పటికే వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్స్ పూర్తి చేసుకున్నది. అన్ని అనుమతులు మంజూరు అయ్యాయి. కానీ, కొన్ని లోపాలను గుర్తించిన రైల్వే బోర్డు, వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ రైళ్ల రాక కాస్త ఆలస్యం అవుతోంది. మరోవైపు తొలివిడుత ఎన్ని స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి? అవి ఏ రూట్లో తిరుగుతాయి? అనే విషయాల మీద కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులు గుడ్ న్యూస్ చెప్పింది. న్యూఢిల్లీ- హైదరాబాద్ మధ్య ఓ వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సూత్రప్రాయంగా ప్రకటించింది. తాజాగా పలువురు ప్రయాణీకులు అడిగిన ప్రశ్నలకు సౌత్ సెంట్రల్ రైల్వే సమాధానం చెప్పింది.

ఢిల్లీ- హైదరాబాద్ రూట్ లో వందేభారత్ స్లీపర్

తెలంగాణకు సంపర్క్ క్రాంతి సర్వీసుల కోసం SCR ఏ చర్యలు తీసుకుంది?  హైదరాబాద్- న్యూఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలును నడపాలని అభ్యర్థించే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అని ఓ ప్రయాణీకుడు అడిగిన ప్రశ్నకు సౌత్ సెంట్రల్ రైల్వే సమాధానం చెప్పింది. ప్రస్తుతం, AP సంపర్క్ క్రాంతి ఎక్స్‌ ప్రెస్ (బైవీక్లీ), కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ ప్రెస్ (వారానికి 5 రోజులు) కాచిగూడ మీదుగా హజ్రత్ నిజాముద్దీన్ వైపు నడుస్తున్నాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి రోజువారీ కొత్త సంపర్క్ క్రాంతి ఎక్స్‌ ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనను రైల్వే బోర్డు పరిశీలన కోసం పంపినట్లు తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపే విషయంలో సకాలంలో రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

40 ఏండ్లకు అనుగుణంగా సౌకర్యాలు

పశ్చిమ కారిడార్‌కు సేవలందిస్తున్న ఏకైక ప్రధాన స్టేషన్ అయిన లింగంపల్లి స్టేషన్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే ప్రశ్నకు సౌత్ సెంట్రల్ రైల్వే స్పండించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లింగంపల్లి స్టేషన్‌ను అప్‌గ్రేడేషన్ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే  రైల్వే బోర్డుకు అనుమతి కోసం ప్రతిపాదన పంపబడినట్లు చెప్పింది. రాబోయే 40 సంవత్సరాలకు ప్రయాణికుల రాకపోకల అంచనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని సౌకర్యాలను కల్పించబోతున్నట్లు వెల్లడించింది.

Read Also: సంక్రాంతి స్పెషల్ రైళ్లు ముందే ప్రకటించండి.. రైల్వే బోర్డుకు లేఖ!

అటు రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఛార్జీల దోడిపీ గురించి ఓ ప్రయాణీకుడు అగిన ప్రశ్నకు రైల్వే కీలక సమాధానం చెప్పింది.  SCR స్టేషన్లలో పార్కింగ్ ఛార్జీలు కీలక విధానం ద్వారా నిర్ణయించబడతాయని తెలిపింది. ప్రధాన బస్ టెర్మినల్స్, విమానాశ్రయాలు, హోటళ్ళు, సమీపంలోని ప్రైవేట్ పార్కింగ్ సౌకర్యాల దగ్గర నిర్వహించిన సర్వేల ఆధారంగా రేట్లు నిర్ణయించబడతాయన్నది. త్వరలోనే వీటిని పరిశీలించి, ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఛార్జీలను వసూళు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రైల్వే వివరించింది.

Read Also: పొగ మంచు ఎఫెక్ట్, 24 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వే!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×