E-Paper
Advertisement

Ustad Bhagat Singh Release: ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేది అప్పుడే… రిలీజ్ పై బిగ్ అప్డేట్!

Ustad Bhagat Singh Release: ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేది అప్పుడే… రిలీజ్ పై బిగ్ అప్డేట్!
Advertisement

Ustad Bhagat Singh: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈయన డిప్యూటీ సీఎం కాకముందు పలు సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే ఆ సినిమాల షూటింగ్ పనులన్నీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓజీ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో తదుపరి” ఉస్తాద్ భగత్ సింగ్” (ఉస్తాద్ Bhagat singh)సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

పోలీస్ ఆఫీసర్ గా పవన్..

డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శ్రీ లీలా(Sreeleela) జంటగా నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. కానీ ఇప్పటివరకు సరైన తేదీని మాత్రం ఎక్కడా తెలియజేయలేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.. ఇదివరకే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత మరోసారి ఇద్దరి కాంబినేషన్లో అది కూడా పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

డిసెంబర్ లో ఫస్ట్ సింగిల్…

Advertisement

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శ్రీ లీల నటించారు అలాగే రాశి కన్నా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక డిసెంబర్లో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించారు. అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ లో ఒకరైన రవి ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka) ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనారు. తాజాగా కన్నడ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు..

2026 ఏప్రిల్ విడుదల..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా రవి మైత్రి మూవీ మేకర్స్ నుంచి రాబోయే సినిమాల గురించి అప్డేట్ ఇచ్చారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 ఏప్రిల్ (April 2026)నెలలో రాబోతుందని ఈయన వెల్లడించడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక మైత్రి నిర్మాణంలో జై హనుమాన్, డ్రాగన్, ఫాజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని ఈ సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని రవి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉస్తాద్ విడుదల తేదీ గురించి ప్రకటించడంతో అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Yash Mother Pushpa: హీరో యష్ తల్లికి బెదిరింపులు… లక్షల్లో మోసం చేసిన పీఆర్వో!

Related News

రేషన్‌కార్డులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×