E-Paper
Advertisement

HBD Shahrukh Khan: 50 రూపాయలతో మొదలైన జీవితం.. వేలకోట్లకు అధిపతి.. మొత్తం ఆస్తి విలువ ఎంతంటే?

HBD Shahrukh Khan: 50 రూపాయలతో మొదలైన జీవితం.. వేలకోట్లకు అధిపతి.. మొత్తం ఆస్తి విలువ ఎంతంటే?
Advertisement

HBD Shahrukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)పేరే.. బాలీవుడ్ లో కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం వేలకోట్ల ఆస్తికి వారసుడు. కానీ ఒకప్పుడు 50 రూపాయల జీతంతో మొదలుపెట్టిన షారుఖ్ ఖాన్ జీవితం.. నేడు 250 కోట్ల రెమ్యూనేషన్ తీసుకునే వరకు ఎదిగింది.అయితే అలాంటి షారుక్ ఖాన్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. మరి షారుక్ ఖాన్ మొదటి సినిమా అవకాశం ఎలా పట్టారు.. ఆయన ఆస్తిపాస్తులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

షారుక్ ఖాన్ మొదటి జీతం..

షారుక్ ఖాన్ 1965 నవంబర్ 2న న్యూఢిల్లీలో మహమ్మద్ ఖాన్, ఫాతిమాల జంటకి జన్మించారు. అలాంటి షారుఖ్ ఖాన్ ప్రస్తుతం దేశం మెచ్చిన హీరోగా మారారు. అలా షారుఖ్ ఖాన్ కి చిన్నప్పటి నుండే సినిమాల మీద విపరీతమైన పిచ్చి ఉండేది. చిన్నతనంలో రాంలీలాలో ఓ కోతి పాత్ర పోషించేవాడట. అలా సినిమాల మీద ఇష్టం పెరిగి ఫైనల్ గా ప్రముఖ థియేటర్ డైరెక్టర్ భారీ జాన్ నుండి యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఈయన సినిమాల్లోకి రాకముందు ఢిల్లీలో ఓ రెస్టారెంట్ ని రన్ చేసేవాడు. అలా ఆయన మొదటి సంపాదన కేవలం 50 రూపాయలు మాత్రమే.. అలాంటి షారుక్ ఖాన్ ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు సంపాదించారు..

Advertisement

ALSO READ:Kissik Talks Vishnu Priya : వేణుస్వామి అలాంటివాడని ఊహించలేదు.. విష్ణు ప్రియా సంచలన వ్యాఖ్యలు!

షారుక్ ఖాన్ ఆస్తులు..

అయితే షారుక్ ఖాన్ మొదట్లో హీరోగా కాకుండా విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలా తన తండ్రి చనిపోయిన బాధని దిగమింగుకొని మంచాన పడ్డ సోదరిని చూసుకుంటూనే సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అలా మొదట ఈయన బుల్లితెరపై రాణించి, ఆ తర్వాత 1992లో వచ్చిన దివానా అనే హిందీ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా విలన్ రోల్స్ చేస్తున్న సమయంలోనే హీరో పాత్రలు కూడా వచ్చాయి. ఇక షారుఖ్ ఖాన్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా అంటే దిల్వాలే దుల్హనియా లేజాయేంగే. ఈ సినిమా షారుక్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక దాదాపు 20 సంవత్సరాల పాటు ముంబైలోని మారాఠా మందిర్ థియేటర్లో ఆడింది అంటే.. ఈ సినిమాకి ప్రేక్షకులు ఏ లెవెల్ లో అట్రాక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి షారుక్ ఖాన్ తాజాగా తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్తుల విలువ బయటపడింది.

మొత్తం ఎన్ని వేల కోట్లంటే?

Advertisement

ఇక షారుక్ ఖాన్ ఆస్తుల విలువ ఏకంగా 870 మిలియన్ డాలర్లు..అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 7,300 కోట్లు.. సినీ తారల్లో అత్యంత ధనికులలో షారుక్ ఖాన్ ముందుంటారు. షారుక్ ఖాన్ సినిమాల్లో హీరోగా నటించిడమే కాకుండా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ని కూడా స్థాపించారు. ఈ బ్యానర్ లో ఎన్నో సినిమాలను నిర్మించారు. అంతేకాకుండా జుహీ చావ్లా తో కలిసి ఐపీఎల్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ అనే టీం ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ టీం విలువ దాదాపు వందల కోట్లని తెలుస్తోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు వ్యాపార ప్రకటనల్లో కూడా షారుక్ ఖాన్ నటిస్తారు. అలా ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కి ఏకంగా 5 కోట్లు ఛార్జ్ చేస్తారు.

పూర్తి వివరాలు..

షారుక్ ఖాన్ కి లండన్, దుబాయ్ లో లగ్జరీ ఇల్లు ఉండడమే కాకుండా ముంబై నడిబొడ్డున మన్నత్ అనే బంగ్లా కూడా ఉంది.ఈ ఇల్లు ధర దాదాపు 200 కోట్లలో ఉంటుందని తెలుస్తుంది. అలాగే పలు బిజినెస్ లలో కూడా ఈయన పార్ట్నర్ గా ఉన్నారు. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ కార్ గ్యారేజీలో కూడా ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. అలా 50 రూపాయల తో మొదలుపెట్టిన ఆయన జీవితం ప్రస్తుతం రూ.7,300 కోట్ల వరకు సంపాదించారు. ఆయన బర్త్డే సందర్భంగా మరోసారి ఆయన ఆస్తిపాస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×