Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ లో తనూజ అనే కంటెస్టెంట్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తన ఆట తీరు చాలామంది గమనించారు. తనమీద సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా నెగిటివ్ కంటే కూడా ఎక్కువగా పాజిటివ్ పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు ఆమె పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది అని అర్థమవుతుంది. సోషల్ మీడియాలో తనకు ఉన్న పీఆర్ చూస్తుంటే చాలామందికి మతిపోతుంది.
బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కి కూడా విపరీతమైన నెగిటివిటీ వస్తుంది. హోస్ట్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కానీ ఒక కంటెస్టెంట్ ను బెటర్ చేయడానికి ఇంకో కంటెస్టెంట్ను తగ్గించాల్సిన అవసరం లేదు. ఒక తప్పును కూడా తప్పు అని ప్రశ్నించకపోవడమే నాగర్జునది పెద్ద తప్పు. బిగ్ బాస్ యాజమాన్యం, నాగార్జున, తనుజ వీళ్ళ ముగ్గురు పైన సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్ ఒక్కటే. డైరెక్ట్ కప్ ఆమెకు ఇచ్చేయండి.
ముఖ్యంగా చాలా రోజుల నుంచి షో గమనిస్తూ ఉంటే ఆమెకి సపోర్ట్ చేస్తున్నట్లు ఈజీగా అర్థమయిపోతుంది. అలానే తనకి నెగిటివ్ గా ఎవరైనా మాట్లాడితే వాళ్లు హౌస్ లో కూడా ఎక్కువ రోజులు ఉండటం లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య కామనర్ గా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చింది.
వచ్చిన మొదటి వారంలోనే తనుజా ను నామినేషన్ చేస్తూ. నువ్వు ఒక ఫేక్, నీ అసలు రంగు బయటపడటం లేదు, నువ్వు నటిస్తున్నావు అంటూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి చెప్పేసింది. అలా చెప్పడం వల్లనే రమ్య ఎలిమినేట్ అయిపోయింది. ఇది చాలామందికి ఉన్న అభిప్రాయం.
అయితే రీసెంట్ గా రమ్య కూడా మాట్లాడుతూ బిగ్ బాస్ లో జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది. తనుజ అనే ఒక పర్సన్ కంటెంట్ లాగడం కోసం ఎంతవరకు ప్రయత్నిస్తుంది ఒక ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేస్తూ కూడా చెప్పింది. ఆ వీడియో కి పాజిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అందరికీ బిగ్ బాస్ యాజమాన్యం చేస్తున్న ప్లాన్స్ అర్ధమైపోయాయి కాబట్టి ఇక షో ఆపేసి డైరెక్ట్ గా కప్ తనుజాకి ఇచ్చేయాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్.
తనుజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే అతిపెద్ద తప్పిదం జరిగింది. ఏకంగా నాగార్జున మాట్లాడుతూ తన గురించి చెబుతూ స్టార్ మా ప్రోడక్ట్ కూడా అని చెప్పేశారు. అది ఇప్పుడు అందరికీ బలంగా నాటుకు పోయింది. దీనివల్లనే బిగ్ బాస్ తనుజాకి ఇస్తున్న సపోర్ట్ ఏంటో ఓపెన్ గా అందరికీ అర్థం అయిపోతుంది.
Also Read: Ustaad bhagat singh : పవన్ కళ్యాణ్ డాన్స్ ఇరగదీశారు, దేవి ఏమన్నాడంటే?