Bigg Boss 9 : బిగ్ బాస్ షో రోజు రోజుకి దిగజారిపోతుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో సెలబ్రెటీలు మరియు కామనర్స్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరుగురు ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయిన తర్వాత మరో ఆరుగురిని హౌస్ లోపలికి పంపించారు. ఇది చదరంగం కాదు రణరంగం అని ముందు నుంచే చెబుతూ వస్తున్నారు. ఆ మాదిరిగానే ట్విస్టులు కూడా ఇస్తున్నారు.
అగ్నిపరీక్షలో తనను తాను బాగా ప్రూవ్ చేసుకొని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్. అగ్నిపరీక్షలో పవన్ చేసిన సాహసాలు చూసి చాలామందికి ఆశ్చర్యం అనిపించింది. అయితే హౌస్ లోకి వెళ్లిన తర్వాత వాటిని ప్రూవ్ చేసుకునే అవకాశం చాలా తక్కువసార్లు వచ్చింది. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేసుకున్నాడు. కానీ వాటిని ఎపిసోడ్లో చూపించలేదు. కేవలం బిగ్ బాస్ యాజమాన్యానికి ఫేవర్ గా ఉన్న వాళ్ళ ఫుటేజ్ మాత్రమే ఎపిసోడ్లో చూపించడం మొదలుపెట్టారు.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో పవన్ హౌస్ లో మోకరించి అందరికీ క్షమాపణలు చెప్పాడు. దీనికి కారణం రీతుని తోయడం. అయితే అది ఎటువంటి సందర్భాల్లో చేశాడో అని రీతు కూడా నాగార్జునకు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆయన వినలేదు.
ఏదో కోపంలో చేశాను అని సారీ కూడా చెప్పాడు పవన్. అని దానిని మరి తారాస్థాయికి తీసుకెళ్లి హౌస్ లో అందరికీ క్షమాపణలు చెప్పేలా చేశారు. గేటు ఓపెన్ చేసి బయటికి వెళ్లిపోమనే పరిస్థితి వరకు తీసుకొచ్చారు. మొత్తానికి పవన్ మోకరించి క్షమాపణలు చెప్పడం అనేది చాలామందికి బిగ్ బాస్ యాజమాన్యం పైన నెగటివ్ ఫీల్ ని తీసుకొచ్చింది.
గతంలో అభిజిత్ కూడా తను ఒక ఉద్దేశంతో ఆ మాటను మాట్లాడలేదు అని ఇలానే సారీ చెప్పాడు. విన్నర్ అయ్యాడు. ఇప్పుడు పవన్ ను అభిజిత్ తో పోలిస్తూ చాలామంది విన్నర్ మెటీరియల్ అంటూ పవన్ కి కూడా మంచి ఎలివేషన్ ఇస్తున్నారు.
ముఖ్యంగా పవన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు కానీ తెలియకుండా రీతుతో ఉన్న ఒక బంధం వలన తనకి ఎక్కువగా బ్యాడ్ నేమ్ వస్తుంది. బిగ్ బాస్ హౌస్ అనేది కేవలం ఒక గేమ్ అని గుర్తించి ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకుండా తన గేమ్ తాను ఆడితే కచ్చితంగా విన్నర్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇకపై తనను తాను మార్చుకొని గేమ్ ఆడుతాడా? లేకుంటే ఇదే కంటిన్యూ చేస్తూ అనవసరంగా అందరికీ సారీలు చెబుతాడా అనేది పవన్ చేతిలో ఉంటుంది.
Also Read: Bigg Boss 9 : ఇంక షో ఆపేసి కప్పు ఆవిడకి ఇచ్చేయండి, ఇదేం మేనేజ్మెంట్?