Kissik Talks Vishnu Priya :ప్రముఖ నటిగా.. యాంకర్ గా.. బిగ్ బాస్ బ్యూటీగా తనకంటూ ఒక పేరు దక్కించుకుంది విష్ణు ప్రియ(Vishnu Priya). నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా బిగ్ టీవీ నిర్వహించిన కిస్సిక్ టాక్స్ అనే షోలో పాల్గొని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చిన ఈమె నచ్చిన వాడు పెళ్లికి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమే అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను.. మార్ఫింగ్ వీడియో వల్ల పడ్డ కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను అంటూ చెప్పి ఎమోషనల్ అయింది. అలాంటి ఈమె తాజాగా వేణు స్వామి(Venu Swami) గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వేణు స్వామి అలాంటి వాడు అని అనుకోలేదు అంటూ సంచలన కామెంట్లు చేసింది విష్ణు ప్రియ.
వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా పేరు సొంతం చేసుకున్న సినిమా సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు సంబంధించిన జ్యోతిష్యం చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు జ్యోతిష్యం తప్పడంతో సెలబ్రిటీల అభిమానులు కూడా వేణుస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు ఈయనపై కేసు కూడా ఫైల్ అయ్యింది. అయితే అలాంటి ఈయన గురించి తాజాగా విష్ణు ప్రియ మాట్లాడుతూ..”మా అమ్మ 42 సంవత్సరాల లోనే చనిపోయింది. ఆమెకు డయాబెటిస్ ఉండేది. నిత్యం మందులు వాడాల్సిన పరిస్థితి. అయితే ఒకానొక సమయంలో చేతిలో డబ్బులు లేక మందులు కొనుక్కోలేక ఎన్నో అవస్థలు పడ్డాము. అమ్మకు మాత్రలు వేసుకోకపోయేసరికి రియాక్షన్ అయింది. మెడికల్ చెకప్ కూడా చేయించుకునేది కాదు.. చివరికి హార్ట్ స్ట్రోక్ వచ్చేవరకు కూడా మాకు ఈ విషయాన్ని ఆమె చెప్పలేదు. అయితే ఈ హార్ట్ స్ట్రోక్ వల్ల హాస్పిటల్లో చేర్పిస్తే మూడు రోజుల కంటే ఎక్కువ బ్రతకదు అని చెప్పారు. అప్పటికే మా జీవితం అయిపోయిందనుకున్నాము.
ALSO READ:Rashmika Mandanna: రష్మిక మంచి మనసు.. కృతజ్ఞత చూపించుకున్న నిర్మాతలు!
అయితే అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు బిల్లు లక్షల్లో అయ్యింది. ఆ సమయంలో ఎవరిని కూడా నేను అప్పు అడగలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో అమ్మకోసం వేణు స్వామికి ఫోన్ చేసి నా పరిస్థితి గురించి వివరించాను.. వెంటనే ఆయన నాకు కావలసిన డబ్బును అరేంజ్ చేశారు. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కో కోణంలో మాట్లాడుతారు. కానీ ఆయన గురించి నిజంగా తెలిసిన వాళ్ళే ఆయన గురించి తప్పుగా మాట్లాడరు. నాకు చాలా ఏళ్ల నుంచి వేణు స్వామి తెలుసు. ఆయన చేసిన సహాయం వల్లే.. మూడు రోజుల్లో చనిపోవాల్సిన అమ్మ ఏడాది పాటు బ్రతికింది. నాకే కాదు ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే వేణు స్వామి ముందుంటారు” అంటూ వేణు స్వామి పై ప్రశంసల వర్షం కురిపించింది విష్ణుప్రియ.
అలాగే బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఆమె మాట్లాడుతూ.. “మా అమ్మ హాస్పిటల్ లో ఉండి ఆ బిల్లు కట్టడం కోసమే నేను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాను. ఎంత కష్టపడ్డా అమ్మను బ్రతికించుకోలేకపోయాను. అమ్మ మరణించిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నాను” అంటూ విష్ణు ప్రియ ఎమోషనల్ అయింది.