E-Paper
Advertisement

కుమారి ఆంటీ లవ్ స్టోరీ విన్నారా…లవ్ లెటర్ ఫ్రేమ్ చేయించి పెట్టిన ఆంటీ!

కుమారి ఆంటీ లవ్ స్టోరీ విన్నారా…లవ్ లెటర్ ఫ్రేమ్ చేయించి పెట్టిన ఆంటీ!
Advertisement

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని జీవనం గడుపుతున్న ఈమె సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎంతో ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదా అందుకున్నారు.కుమారి ఆంటీ ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూనే మరోవైపు తన ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వెజ్, నాన్ వెజ్ అంటూ వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు వాటిని అమ్ముతూ తన జీవనం గడుపుతున్నారు. ఇలా ఫుడ్ బిజినెస్(Food Business) ద్వారా ఎంతో బిజీగా ఉన్న కుమారి ఆంటీ(Kumari Aunty) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

కుమారి ఆంటీ ప్రేమ వివాహం..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక కుమారి ఆంటీ అసలు పేరు దాసరి సాయి కుమారి. కైకలూరు సమీపంలో తామరకొల్లు గ్రామంలో జన్మించిన ఈమె పెద్దగా చదువుకోలేదని కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు. ఇక తనకు 2004వ సంవత్సరంలో వివాహం జరిగిందని తనకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారని తెలిపారు. అయితే తనది ప్రేమ వివాహం అంటూ కుమారి ఆంటీ భర్త బాబి ఈ సందర్భంగా తెలియజేశారు .

లవ్ లెటర్ దాచుకున్న కుమారి ఆంటీ..

Advertisement

ఈ సందర్భంగా కుమారి ఆంటీ భర్త మాట్లాడుతూ తమది ప్రేమ వివాహమని అయితే తాను ప్రేమిస్తున్నట్టు కుమారికి తెలియదు వన్ సైడ్ లవ్ అంటూ ఈయన తెలియజేశారు. కొద్దిరోజుల తర్వాత కుమారి ఆంటీకి ఒక లవ్ లెటర్ ద్వారా ప్రపోజ్ చేసినట్టు బాబి తెలిపారు. అలాగే ఆ లవ్ లెటర్ కుమారి ఆంటీ ఇప్పటికీ ఎంతో భద్రంగా ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ లవ్ లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తన భర్త బాబి తనకు ఎంతో అద్భుతంగా తన ప్రేమను వ్యక్తపరుస్తూ రాయడంతో నేటిజన్స్ ఫిదా అవుతున్నారు..

నిన్ను చూసిన ఆ క్షణం మరువలేనిది నా హృదయం..

Advertisement

ఇక బాబి ఈ లెటర్ తనకు 2003 అక్టోబర్ 25వ తేదీ రాసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా.. “ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూసిన ఆ క్షణం మరువలేనిది నా హృదయం. నా మనసు దోచుకున్న రూపమా.. నీవు నాకు దక్కుతావో లేదోనని తపిస్తోంది నా మనసు. నీ రాక కోసం ఎదురు చూస్తోంది నా ప్రాణం. ఐ లవ్ యు సాయి.. ఇట్లు నీ ప్రియుడు బాబి” అంటూ కుమారి ఆంటీ భర్త పెళ్లికి ముందు తనకు రాసిన లవ్ లెటర్ ఇప్పటికీ ఈమె ఎంతో భద్రంగా దాచుకోవడంతో వీరి ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఫోటో పై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు అసలు కుమారి ఆంటీ లవ్ స్టోరీ సినిమాని మించిన ఫీల్ ఉందని దాదాపు 23 సంవత్సరాలు అయిన మొదటి ప్రేమలేఖను భద్రంగా దాచుకోవడం అంటే వీరి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో స్పష్టమవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: ఆ ఒక్క డైలాగ్ నా పొట్ట కొట్టింది… ఆయనకు రుణపడి ఉంటానన్న కుమారి ఆంటీ

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×