E-Paper
Advertisement

Biker Movie: ‘బైకర్’ మూవీ మోటివేషన్ యాంథమ్ ‘జిద్ధి జిద్ధి’.. ఎలా ఉందంటే?

Biker Movie: ‘బైకర్’ మూవీ మోటివేషన్ యాంథమ్ ‘జిద్ధి జిద్ధి’.. ఎలా ఉందంటే?
Advertisement

Biker Movie: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) నుంచి రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘బైకర్’ (Biker Movie). ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి మోటోక్రాస్ మూవీ, హై-ఆక్టేన్ రేసింగ్ యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శర్వానంద్ పుట్టినరోజు (మార్చి 6)ను పురస్కరించుకుని మూవీ టీమ్ శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా నుంచి ‘జిద్ధి జిద్ధి’ (Ziddi Ziddi Lyrical Song) అనే సరికొత్త ట్రాక్‌ను విడుదల చేశారు. ఈ పాట సినిమా ఆల్బమ్‌లో ఒక స్పూర్తిదాయక మోటివేషనల్ ఆంథమ్‌గా నిలుస్తోందని మేకర్స్ తెలుపుతున్నారు. పాట విషయానికి వస్తే..

Also Read- Ustaad Bhagat Singh:ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై హరీష్ శంకర్ అప్డేట్.. అలా చేయక తప్పట్లేదు అంటూ..!

రాజశేఖర్ మెంటర్‌గా

Advertisement

ఈ పాటను జిబ్రాన్ స్వరపరిచడంతో పాటు, ఆయనే ఆలపించారు. ఆయనతో పాటు ఈ పాటలో షెన్‌బగరాజ్, అరవింద్ శ్రీనివాస్, సుదర్శన్ రామ్ కూడా వోకల్స్ అందించారు. కృష్ణకాంత్ రాసిన ఈ సాహిత్యం లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన పట్టుదల, ధైర్యం, నిరంతర ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తూ.. స్ఫూర్తిదాయకంగా సాగుతోంది. పాటలోని మాంటేజ్‌లో శర్వానంద్ ఒక ప్రొఫెషనల్ మోటోక్రాస్ రేసర్‌గా మారే ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. కఠినమైన వర్కౌట్స్, ఎండ్యూరెన్స్ రన్స్ చేయడం, వర్క్‌షాప్‌లో తన డర్ట్ బైక్‌ను స్వయంగా రిపేర్ చేయడం వంటి సన్నివేశాలు చూస్తుంటే.. సినిమాలో అతని అంకితభావం, క్రమశిక్షణను హైలైట్ చేస్తున్నాయి. ఈ ట్రైనింగ్‌లో రాజశేఖర్ ఒక మెంటర్‌గా కనిపిస్తూ శర్వా ప్రోగ్రెస్‌ను పర్యవేక్షించడం మరింత ఎమోషన్‌ని జోడిస్తోంది.

Also Read- Virosh wedding: మమ్మల్ని పెళ్లికి పిలవచ్చుగా… విరోష్ జంటను ప్రశ్నించిన బుల్లి అభిమాని.. వీడియో వైరల్!

మరో హిట్ పక్కా..

Advertisement

ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్నట్టే.. ఈ పాట కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. అద్భుతమైన రిథమ్, ఆకట్టుకునే విజువల్స్‌తో వచ్చిన ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో శర్వా మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు రాబోతున్న ఈ ‘బైకర్’ కూడా ఆయనకు మంచి మెమరబుల్ హిట్‌గా నిలుస్తుందనే ఫీల్‌ని ఈ పాట ఇస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి డాల్బీ సినిమా, EPIQ, 4DX , PCX వంటి ప్రీమియం ఫార్మాట్‌లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Also Read- Sampradayini Suppini Suddapoosani Review: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×